35.3 C
India
Tuesday, May 21, 2024
More

    ఏప్రిల్ 1st 2023 రాశి ఫలితాలు

    Date:

    April 1st 2023 Horoscope
    April 1st 2023 Horoscope

    మేషం

    దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి కొంత బాధిస్తుంది. బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

    —————————————

    వృషభం

    ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధు వర్గంతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టం తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.

    —————————————

    మిధునం

    చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

    —————————————

    కర్కాటకం

    ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

    —————————————

    సింహం

    కుటుంబ సభ్యులతో శుభకార్యలకు హాజరువుతారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంతనానికి నూతన విద్యా ఉద్యోగఅవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

    —————————————

    కన్య

    ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

    —————————————

    తుల

    వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.

    —————————————

    వృశ్చికం

    ఉద్యోగమున ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నూతన విషయాలు సేకరిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

    —————————————

    ధనస్సు

    బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి . ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగమున శ్రమాదిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

    —————————————

    మకరం

    చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. దైవ చింతన పెరుగుతుంది వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

    —————————————

    కుంభం

    ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మొండి బాకీలు వసూలవుతాయి.

    —————————————

    మీనం

    నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    20th October Horoscope : నేటి రాశి ఫలాలు

    20th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో నిరుత్సాహమే...

    October 10th Horoscope : నేటి రాశి ఫలాలు

    October 10th Horoscope : మేష రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది....