29.5 C
India
Sunday, May 19, 2024
More

    Where is Pushpa ?

    Date:

    Where-is-Pushpa
    Where-is-Pushpa

    Where is pushpa ? అంటూ ఓ వీడియో విడుదల చేశారు మైత్రి మూవీ మేకర్స్. తిరుపతి పోలీస్ స్టేషన్ నుండి బులెట్ గాయాలతో పుష్ప తప్పించుకున్నాడని , ఇప్పుడు అతడు తప్పించుకొని ఎక్కడికి పారిపోయాడు ? అంటూ ఓ వీడియో విడుదల చేసారు. పోలీస్ స్టేషన్ పైకి పెద్ద ఎత్తున జనాలు తరలి రావడం వాళ్ళను పోలీసులు చెల్లాచెదురు చేయడం , బాంబ్ బ్లాస్ట్ వంటి సన్నివేశాలు అల్లు అర్జున్ అభిమానులను అలరించేలా ఉన్నాయి.

    2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పుష్ప భారీ విజయం సాధించడంతో పుష్ప 2 చిత్రాన్ని చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎప్పటి లాగే చంద్రబోస్ ఈ చిత్రంలోని అన్ని పాటలను రాసాడు. ఇందులో కూడా ఐటమ్ సాంగ్ అద్భుతంగా వచ్చిందట.

    ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఆ సందర్భంగా పుష్ప చిత్రం నుండి అప్ డేట్ రానుంది. దానికి సంబంధించిన ఓ చిన్న వీడియో ఈరోజు కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది పుష్ప 2 యూనిట్. ఇక ఈ వీడియో అభిమానులను విశేషంగా అలరించేలా ఉంది. సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచింది.

    అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫాహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా సునీల్ , అనసూయ , తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...