30 C
India
Wednesday, May 15, 2024
More

    ప‌రేషాన్‌లో విజ‌య‌మ్మ‌..!

    Date:

    vijayamma
    vijayamma

    దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌కు రాజ‌కీయాల‌పై పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు ప‌నిచేసిన‌ప్ప‌టికీ..విజ‌య‌మ్మ ఏనాడు పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేరు. ఆమె కుటుంబం ఉమ్మ‌డిగా ఉండ‌డంతో విజ‌య‌మ్మ‌కు ఏ రోజు ఏర‌క‌మైన ఇబ్బందులు రాలేదు.

    కానీ,ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఏదో ఒక లైన్ తీసుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. విజ‌య‌మ్మ మ‌ర‌ది,క‌డ‌ప ఎంపీ వైఎస్ వివేకా నంద‌రెడ్డి మార్చి 15 2019న మృతి చెందారు. ఈయ‌న తొలుత గుండె పోటుతో చ‌నిపోయిన‌ట్లు చెప్పిన‌ప్ప‌టికీ..త‌ర్వాత హ‌త్య‌గావించ‌బ‌డ్డార‌ని తేలింది. అయితే వివేకా హ‌త్య కేసుపై ఆయ‌న కూతురు సునీతా సుప్రీంకోర్ట్ వరకు వెళ్లడంతో..ప్ర‌స్తుతం ఈ కేసు సంచ‌ల‌నంగా మారింది. ప్రధానంగా సీబీఐ క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే మ‌ర్డ‌ర్ జ‌రిగిన‌ట్లు ఆరోపిస్తోంది సీబీఐ.

    ఈ నేప‌థ్యంలోనే అవినాశ్ రెడ్డి అండ్ బ్యాచ్ వివేకానందారెడ్డి రెండో భార్య వ్య‌వ‌హారాన్ని తెర‌పైకి తెచ్చి ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. సాక్షి ప‌త్రిక‌లో కూడా అవినాశ్‌కు మ‌ద్ద‌తుగా వివేకాకు వ్య‌తిరేక‌తంగా క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి,వైఎస్ఆర్టీపీ అధినేత్రి ష‌ర్మిల ఆయ‌న చిన్నాన‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డం ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం సృష్టించిన‌ట్లైంది. చిన్నాన్న హ‌త్య ఆస్తి కోసం మాత్రం కాద‌ని ష‌ర్మిల కామెంట్స్ చేయ‌డం ప్ర‌కంప‌న‌ల‌కు దారి తీసింది.

    ప‌రేశాన్‌లో విజ‌య‌మ్మ‌..!

    ఇక కొన్నాళ్లుగా వైఎస్ఆర్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌,ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య స‌ఖ్య‌త ఉండ‌డం లేదు. చిన్నాన్న కేసు విష‌యంలో ప్ర‌త్యేక్షంగానో ప‌రోక్షంగానో జ‌గ‌న్ అవినాశ్ రెడ్డికే మ‌ద్ద‌తు ప‌లుకుతు న్నారు. ఈనేప‌థ్యంలోనే ష‌ర్మిల వివేకా కూతురు సునీత‌కు బాస‌ట‌గా నిలిచారు. అయితే వీరిద్ద‌రి ప‌రిస్థితి ఇలా ఉంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ ఎటు వైపు ఉంటార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక రంగా మారింది. ఆమె ష‌ర్మిల‌కు స‌పోర్ట్‌గా మాట్లాడుతారా..? లేక..జ‌గ‌న్‌ను స‌మ‌ర్థిస్తారా..? అనే తేల్చుకోవా ల్సిన ప‌రిస్థితి ఆస‌న్న‌మైంది. ఈ విష‌యంలో విజ‌య‌మ్మ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ప్ర‌స్తుతానికి ఏపీ రాజ‌కీయాల్లో ఇంట్రెస్టింగ్ వ్య‌వ‌హారంగా మారింది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Avinash Reddy : కడపలో అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదా..?

    Avinash Reddy : ఎన్నికల ప్రచార హడావుడి కొన్ని గంటల్లో ముగియనుంది....

    CBI Investigation : తిరుపతి చంద్రగిరి – రైల్వే SSE, ADEE లంచం కేసులో సీబీఐ విచారణ

    CBI Investigation :  ఏపీ తిరుపతి:  రెండు రైల్వే జోన్‌లకు చెందిన ఇద్దరు...

    CM Revanth : ‘కాళేశ్వరం’లో అవినీతిపై రేవంత్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదు?

    CM Revanth : తెలంగాణ రాజకీయాలు గత కొద్దికాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు...

    YS Avinash Reddy : వైఎస్ అవినాష్ బెయిల్ రద్దుకు సీబీఐ పిటిషన్

    YS Avinash Reddy : ఏపీ సీఎం సోదరుడు, కడప ఎంపీ వైఎస్...