29.4 C
India
Tuesday, May 14, 2024
More

    జూ.ఎన్టీఆర్ కి పిలుపులేదు.. రజనీని రమ్మన్నారు!

    Date:

    ntr
    ntr

    తెలుగు సినిమా నట విఖ్యవిఖ్యాత ,  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు విజయవాడలో ముగిశాయి. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్.. సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు.

    ఈ వేడుకలకు వచ్చిన రజనీ కాంత్ ఏపీ మాజీ  చంద్రబాబుపై ఆయన పాలనపై ప్రశంసలు కురిపించారు.చంద్రబాబు తనకు మోహన్ బాబు ద్వారా పరిచయమయ్యాడని,  తనకు 30 సంవత్సరాలుగా మిత్రుడని, చెప్పుకొచ్చారు.  చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని హైద్రాబాద్  డెవలప్ చేసింది. ఆయనేన్నారు. 2024లో చంద్రబాబు గెలిస్తే ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతుందంటూ రజినీకాంత్ జోస్యం చెప్పారు.

    అయితే ఈ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో ఆయన అభిమానులు సందడి చేశారు. స్టేజీ ఎదురుగా జూనియర్ ఎన్టీఆర్ జెండా, ఫోటోలను ప్రదర్శించారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాల చేశారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందలేదు. మొదట్లో ఆహ్వానితుల్లో ఆయన పేరు ఉన్నప్పటికీ- ఆ తరువాత మాయమైంది.ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల సూచనల మేరకే ఆహ్వానితుల జాబితా నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరును తొలగించారనే ప్రచారం ఉంది. జూనియర్‌ను ఆహ్వానించకపోవడం పట్ల ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. మరోసారి ఆయనను అవమానించినట్లు భావిస్తోన్నారు. గతంలో చోటు చేసుకున్న ఇలాంటి సందర్భాలను గుర్తు చేస్తోన్నారు.

    సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు, తమ అభిమాన నటుడిని పిలవకపోవడం పట్ల అభిమానులందరూ తీవ్ర నిరాశలో ఉన్నారని సమాచారం. ఆయన నటనను పునికిపుచ్చుకున్న ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచినంత మాత్రాన తాము నిరాశకు గురి కావాల్సిన పని లేదని  జూ. ఎన్టీఆర్ భావిస్తున్నారు.

    జూ. ఎన్టీఆర్ ను దూరం పెట్టడం వలన తమకు వచ్చిన నష్టం ఏమి లేదని.. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకీ జూ ఎన్టీఆర్ అభిమానులు తగిన గుణపాఠం చెప్తారని ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను పిలువక.. తమిళ నటుడు రజనీ కాంత్ కు పెద్ద పీఠ వేయడం ఏంటనీ ఇప్పుడు ఏపీ చర్చానీయాంశంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...