33.3 C
India
Thursday, May 16, 2024
More

    YCP in AP : మరీ ఇంత స్వామి భక్తా.. ఏపీలో వైసీపీ పై విమర్శలు

    Date:

    YCP in AP
    YCP in AP

    YCP in AP : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నేతల తీరు పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తు్న్నది. మరి ముఖ్యంగా గుడులు, బడులు అనే తేడా లేకుంటే అన్నింటికి ఆ పార్టీ జెండా రంగులు వేస్తూ ప్రజలు ముక్కున వేలేసుకునేలా చేస్తు్న్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు కూడా తమ పార్టీ రంగులు వేసుకుంటున్నారని పచ్చ పార్టీ నేతలు ఎద్దేవా చూస్తున్నారు.

    తాజాగా ఏమైందంటే..

    తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జాతర జరుగుతున్నది. ఆలయ ప్రధాన ద్వారం వద్ద మంగళవారం పూల తోరణాన్ని ఏర్పాటు చేశారు. అయితే పూల అంకారం వైసీపీ జెండా రంగులు పోలిన పూల మధ్యలో జే అనే అంగ్ల అక్షరం, తుపాకి బొమ్మ డిజైన్ తో పెట్టారు. ఇదే ప్రస్తుతం విమర్శలకు కేంద్ర బిందువైంది. అన్ని పార్టీల నాయకులు దీనిపై మండిపడుతున్నారు. మరి ఇంత స్వామి భక్తి సరికాదని అంటున్నారు. ఆలయాలపై కూడా జగన్ పై అభిమానాన్ని చూపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ధైవసన్నిధిలో ఇదేం సంస్కృతి అని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జే అనే అక్షరంతో ఆలయానికి ఏం సంబంధమని ట్వీట్ చేశారు. జే గ్యాంగ్ బరితెగింపు మరి ఈ స్థాయిలో ఉందని టీడీపీ యువనేత లోకేశ్ ట్వీట్ చేశారు. వైసీపీ నేతల తీరు సరికాదని, దేవాలయంలో జగన్  పై భక్తి చాటుకోవడం సరికాదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

    సోషల్ మీడియాలో వైరల్..
    ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలయానికి కూడా ఇలా రాజకీయ రంగు పూలమడం పై హిందూ అభిమానులు మండిపడుతున్నారు. వైసీపీ వచ్చాక జరుగుతున్న పరిణామాలు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, ఇది సరికాదని అంటున్నారు. ఆలయ అలంకరణలో గన్ తో పనేంటని,  ఇదే మా సంస్కృతి అని చెబుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది మరెంత వివాదానికి దారితీస్తుందోనని ఇటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Jagan Yatra : ఈనెల 27వ తేదీ నుంచి జగన్ యాత్ర ప్రారంభం

    Jagan Yatra : ఈనెల 27వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్...

    TDP MLA Ticket : ఎమ్మెల్యే టికెట్ రాలేదని  కంటతడి పెట్టిన టిడిపి మహిళా నేత..

    TDP MLA Ticket : తిరుపతి టికెట్ జనసేన అభ్యర్థి శ్రీనివాసులకి...