31.9 C
India
Monday, May 6, 2024
More

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    Date:

    CM Ramesh
    CM Ramesh

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక కాలంలో వస్తున్నాయి. దీంతో నాయకులు, అధి నాయకుల వాడి వేడి ప్రసంగాలతో రాష్ట్రం మరింత హీటెక్కుతోంది. మూడు పార్టీలు (టీడీపీ, జనసేన, బీజేపీ) కలిసి మహా కూటమిగా ఏర్పడగా.. వైసీపీ మూడు పార్టీలను ఒంటరిగా ఎదుర్కొటోంది.

    సర్వేలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చినా అంతిమ విజయం మహాకూటమికి రావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఇక నాయకులు వారి అభిప్రాయలను చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇందులో భాగంగా సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

    బీజేపీ నేత, టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి సీఎం రమేష్ ఇటీవల ఒక పత్రికా ఎడిటర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీలో తనకున్న పలుకుబడి గురించి, అమిత్ షాకు నమ్మకమైన వ్యక్తి గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఏపీలో కూటమి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం రమేష్ అన్నారు.

    జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వైసీపీ నుంచి జంప్ అయ్యేందుకు నెలల తరబడి వేచి ఉండరు. కనీసం కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు సమయం ఇస్తున్నారని, కానీ జగన్, వైసీపీ విషయంలో అలా జరగదన్నారు.

    ఎన్నికల ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్నారు. ఆ పార్టీ నేతలు చాలా మంది టీడీపీ, జనసేన, బీజేపీలో చేరనున్నారు. వైఎస్ జగన్ పట్ల వ్యవహరించిన తీరు వల్ల ఆయన పట్ల విధేయత, సానుభూతి తమ పార్టీలో లేవన్నారు.

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, జూన్ 4, 2024న ఓట్ల లెక్కింపు జరగనుంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...