TDP MLA Ticket : తిరుపతి టికెట్ జనసేన అభ్యర్థి శ్రీనివాసులకి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి కోసం అహర్ని శలు పనిచేసిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటూ బోరున వినిపించారు.
చంద్రబాబు సర్వేలన్నీ ఏమయ్యాయి అని ఆమె ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్ద తు ఇవ్వమంటే నేను అంగీకరించిన మా కేడర్ ఒప్పుకోవడం లేదని సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అభ్యర్థి పై పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన తనకు లేదని మరోసారి స్పష్టం చేశారు.
పొత్తు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా టిడిపి నేతలకు టికెట్లు దక్క లేదు. దీంతో వారంతా తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్టు రాకపోవడంతో కొందరు జెండాలు తగలబెట్టి ఆందోళన చేస్తుంటే మరికొందరు బోరున వినిపిస్తున్నారు.