36.9 C
India
Monday, May 20, 2024
More

    Anand Mahindra : సంచలన ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఈసారి ధోని గురించి..!

    Date:

    Anand Mahindra
    Anand Mahindra

    Anand Mahindra : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. పలు వీడియోలు పోస్టులతో సంచలనాత్మక విషయాలను చెబుతారు. అయితే ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ క్రికెట్ అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేపుతోంది.

    ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే క్రికెటర్ ధోని రాజకీయాల్లోకి రావాలని కోరాడు. ధోనిలో నాయకత్వ పటిమ పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. ఎన్సీసీ రివ్యూ ప్యానెల్ ల్లో ధోనితో కలిసి పని చేశాను అని చెప్పుకొచ్చాడు. క్రికెట్తో పాటు ఇతర విషయాల్లోనూ ధోని చురుగ్గా ఉంటాడని, ఇతరులతో సులువుగా కలిసి పోతాడని పేర్కొన్నారు. అన్ని రకాలుగా ఆలోచించే ధోని లో ఒక ఫ్యూచర్ లీడర్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. కచ్చితంగా ధోని రాజకీయాలకు పనికి వస్తాడని తనలో ఏదో శక్తి ఉందని తెలిపారు.

    ఐపీఎల్ 16 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కప్పును అందించడంలో ధోని నాయకత్వ స్యామర్థమే కీలకం. దీనిపై పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు మాజీ ఆటగాళ్లు ఇప్పటికే పోస్టులు పెట్టారు. అంతా ధోనిని అభినందిస్తున్నారు. ధోని వల్లే చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి కప్పును గెలుచుకుందని ఇది తక్కువ విషయం ఏమీ కాదని చెప్పుకొచ్చారు. జట్టు సభ్యులను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లడంలో ధోని లాగా మరి కెప్టెన్ పని చేయలేరని తెలిపారు. మ్యాచును ఆఖరి నిమిషంలో కూడా మలుపు తిప్పే సత్తా ధోనీకి ఉందని కొనియాడుతున్నారు.

    ఈ సందర్భంగా సహచరులతో పాటు మాజీ ఆటగాళ్లు, పలువురు రాజకీయ ప్రముఖులు ధోనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు అయితే ఆనంద మహేంద్ర మరికాస్త ముందుకెళ్లి ధోని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరి ఈ జార్ఖండ్ డైనమెట్ ధోని మనసులో ఏముందో తెలియాలి కదా. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో మాత్రమే ఆడుతున్నాడు. మరి భవిష్యత్తులో ధోని నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    MS Dhoni : దోనిని టీ 20 వరల్డ్ కప్ ఆడించొచ్చు.. కానీ ఒప్పించడమే కష్టం 

    MS Dhoni : మహేంద్ర సింగ్ దోని భారత క్రికెట్ దిగ్గజం....

    Anand Mahindra : ఏం ఐడియా సర్ జీ.. ‘ఆనంద్ మహీంద్రా’ షేర్ చేసిన వీడియో వైరల్..

      Anand Mahindra : ఆనంద్ గోపాల్ మహీంద్రా గురించి పరిచయం అవసరం...