38.1 C
India
Sunday, May 19, 2024
More

    Tucker movie : టక్కర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. ఇప్పుడైనా సిద్ధార్థ్ కు హిట్ దక్కిందా?

    Date:

     

     

    
    Tucker movie review and rating : 

    టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సిద్ధార్థ్ అంటే చాలా మందికి ఇష్టం.. ఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్ గా బాగా ఫేమస్ అయ్యి అమ్మాయిలలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఈయన వరుసగా ప్లాప్స్ అందుకుని కొన్నాళ్ళకు తెలుగులో మొత్తమే సినిమాలు మానేసాడు. టాలీవుడ్ కు దూరం అయ్యాక ఇతడు మళ్ళీ తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు.

    అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ డబ్బింగ్ చిత్రాలతో పలకరించే ఈ హీరో తాజాగా టక్కర్ అనే సినిమాను చేసారు. సిద్ధార్థ్ హీరోగా దివ్యాంశ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కగా ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను కార్తీక్ జీ క్రిష్ డైరెక్ట్ చేసాడు.. మరి ఈ సినిమాతో అయిన సిద్ధార్థ్ హిట్ అందుకున్నాడా? లేదా? అనేది చూద్దాం..

    కథ :

    ఒక మధ్యతరగతి కుర్రాడు డబ్బులు సంపాదించి ఎలాగైనా కోటీశ్వరుడు అవ్వాలనే ఆశతో చెన్నైకు వెళ్లగా అక్కడ అతడు ఎంచుకున్న రూట్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.. అతడు ఆ సమస్యల నుండి బయట పడ్డాడా? అనేది  మిగిలిన కథ..

    నటీనటుల నటన :

    ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా సిద్ధార్థ్ నటన ఉండాల్సింది.. కానీ ఈయన నటనే ఈ సినిమాకు మైనస్ అనేలా ఆయన నటనలో ఆకట్టుకోలేక పోయాడు.. అందుకే ఈ సినిమాకు ఇదే పెద్ద లోటు అయ్యింది. అలాగే విలన్ పాత్ర కానీ మిగతా పాత్రల నటన కానీ ఆకట్టుకోలేదు.

    టెక్నీకల్ పరంగా చూస్తే..

    కార్తీక్ జీ క్రిష్ ఈ సినిమాతో ఆడియెన్స్ కు చిరాకు తెప్పించాడు.. ఇతడు సినిమా తీసిన తీరు చూస్తుంటే ఆయనకే కథ మీద క్లారిటీ లేదు అనిపిస్తుంది. అలాగే చెప్పాల్సిన కథను పట్టకు పెట్టి మధ్యలో కొన్ని సీన్స్ ను ఇరికించాడు అనిపిస్తుంది. అలాగే రొమాన్స్, అడల్ట్ కంటెంట్ కూడా మితిమీరింది.. పాటలు కానీ స్క్రీన్ ప్లే కానీ ఆకట్టుకోలేక పోయాయి.

    ప్లస్ పాయింట్స్ :

    హీరోయిన్ గ్లామర్
    ఫస్ట్ హాఫ్

    మైనస్ పాయింట్స్ :

    నటీనటుల చెత్త పర్ఫార్మెన్స్
    కథలో ఎలాంటి బలం లేదు
    సెకండాఫ్ సాగదీత

    చివరిగా..

    సిద్ధార్థ్ సినిమాలు అంటే యూత్ ను ఆకట్టుకునే విధంగా చాలా లవ్లీగా ఉంటాయి.. కానీ ఈ సినిమాను ఎందుకు తీశారో ఎవరికీ అర్ధం కాదు.. సినిమా మొత్తం గందరగోళంగా ఉండడంతో ఏ వర్గాన్ని కూడా ఆకట్టుకోలేదు..

    రేటింగ్ :

    2/5

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Takkar Trailer Review : టక్కర్ ట్రైలర్ రివ్యూ!

    Takkar Trailer Review : టాలెంటెడ్ హీరోల్లో సిద్ధార్థ్ ఒకరు.. ఈయన...