37.8 C
India
Saturday, May 18, 2024
More

    Siddhu Chiranjeevi : చిరంజీవితో సిద్దూ స్క్రీన్ షేర్.. ఎంత డిమాండ్ చేశాడో తెలుసా..?

    Date:

    Siddhu Chiranjeevi
    Siddhu Chiranjeevi

    Siddhu Chiranjeevi : ప్రజెంట్ యూత్ లో మాస్ క్రేజ్ ఉన్న హీరో అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు సిద్దు జొన్నలగడ్డ. ఆయన కెరీర్ ‘డీజే టిల్లు’కు ముందు ఆ తర్వాత అని చెప్పవచ్చు. అతకు మందు ఆయన కొన్ని సినిమాల్లో నటించారు కానీ అవి ఆయనకు ఏ మాత్రం గుర్తింపు తెచ్చిపెట్టలేదు సరికదా.. కెరీర్ ముగుస్తుంది అనుకున్నాడు. ఇక డీజే టిల్లు రావడంతో ఒక్కసారిగా మాస్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

    సిద్దు గతంలో ‘గుంటూరు టాకీస్’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించాడు కానీ, గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇక లాక్ డౌన్ సమయంలో రానా నిర్మించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’తో యూత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. అది కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. సిద్ధు హీరోగానే కాకుండా స్క్రిప్ట్ రైటర్ కూడా.. ‘డీజీ టిల్లు’కు ఆయనే స్క్రిప్ట్, మాటలు అందించారట. ఇక విడుదలకు సిద్ధమవుతున్న ‘టిల్లు స్క్వేర్’కు కూడా స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ ఆయన ఇచ్చినవేనట.

    ఇంత టాలెంట్ ఉండి కూడా మంచి అవకాశాలు లేక అంతగా రాణించలేకపోయారు సిద్దూ. ఇక డీజే టిల్లు ఆయన కెరీర్ ను పూర్తిగా మార్చివేసింది. మాస్ లో మంచి ఫాలోయింగ్ పెంచింది. డిఫరెంట్ డైలాగ్స్, మాడ్యులేషన్ ఆయనకు విపరీతంగా హైప్ ను పెంచాయి. డీజే టిల్లు భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సమయంలోనే నిర్మాత టిల్లు స్క్వేర్ ను అనౌన్స్ చేశారంటే మాటలు కాదు.

    ఇప్పుడు సిద్దు సినిమాకు యూత్ ఒక్కటే కాదు ఫ్యామిలీలు కూడా తెగ చూసేస్తున్నారు. జోక్స్ అది తెలంగాణ యాసతో వామ్మో థియేటర్ నవ్వులతో అదిరిపోవాల్సిందే. ఇంతటి హైప్ సంపాదించుకున్న ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచేశారు. టిల్లు స్క్వేర్ సినిమాకు రూ. 3కోట్ల 50 లక్షల పారితోషికం తీసుకున్నారంట.

    మెగాస్టార్ చిరంజీవి-వశిష్ట కాంబోలో వస్తున్న వస్తున్న సినిమాలో సిద్దూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాలో ఆయనకు సబంధించిన కొన్ని సీన్స్ ఉండనున్నాయి. అయితే ఇందులో కనిపించేది తక్కువ సమయమే అయినా  రూ. 4 కోట్లు తీసుకుంటున్నారట. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే చాలు అనుకున్న రోజుల నుంచి కోట్లాది రూపాయల డబ్బులను డిమాండ్ చేసేంత ఎదిగిన తీరుపై ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపించాల్సిందే..

    Share post:

    More like this
    Related

    TS EAPCET-2024 : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదల

    TS EAPCET-2024 Results : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి....

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Siddu Jonnalagadda : జొన్నలగడ్డ సిద్దు వైపు చూస్తున్న సినీ నిర్మాతలు

    Siddu Jonnalagadda : థియేటర్లో తెరపై సినీ హీరో జొన్నలగడ్డ సిద్దు...

    Tillu Cube : టిల్లు క్యూబ్ తో అట్లుంటదట మరి!

    Tillu Cube : డీజే టిల్లు విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు...

    Sidhu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ.. లీగ్ మారిపోయింది..

    Sidhu Jonnalagadda : రంగుల ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, దేనికి సక్సెస్...