36.8 C
India
Thursday, May 2, 2024
More

    Sidhu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ.. లీగ్ మారిపోయింది..

    Date:

    Sidhu Jonnalagadda
    Sidhu Jonnalagadda

    Sidhu Jonnalagadda : రంగుల ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, దేనికి సక్సెస్ వస్తుందో.. ఏది ఇండస్ట్రీ నుంచి వెళ్లగొడుతుందో చెప్పలేం. ఒక సినిమాతో రోడ్డున పడ్డ హీరోలు ఉన్నారు. అదే ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న వారు కూడా లేకపోలేదు. ఒక్క సినిమాతో ఇమేజ్ మారిపోయిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు.

    సిద్ధూ జొన్నలగడ్డను చూసుకుంటే ఈ హీరో ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఏ సినిమా వచ్చిందో.. ఏ సినిమాలో కనిపించాడో చెప్పడం కష్టంగా మారింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’లో మంచి గుర్తింపు ఉన్నా.. ‘డీజే టిల్లు’ మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. డీజే టిల్లు ముందు ఐదేళ్లపాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు విపరీతంగా పోరాడాడు. ఆ కష్టాన్ని మొత్తం మరిపించింది డీజే టిల్లు.

    డీజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ చేశాడు సిద్ధూ. ఇది కూడా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను కలెక్షన్లతో ముంచెత్తింది. టిల్లు స్క్వేర్ ను బగా ప్రమోట్ చేసి.. క్రేజీ ప్రోమోలు రిలీజ్ చేసి మూవీపై హైప్ పెంచాడు. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సాధిస్తోంది. ఫస్ట్ షో నుంచి ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి.

    ‘టిల్లు స్క్వేర్’ కు వీకెండ్ సాయంత్రం షోలకు టికెట్లు దొరకడం కష్టమై పోయింది. శనివారం, ఆదివారం ఫస్ట్, సెకండ్ షోలు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచాయి. ఆదివారం అన్ని షోలు ఆక్యుపెన్సీతో నడవబోతున్నాయి. సినిమా గ్రాస్ రూ.50 కోట్ల గ్రాస్ మార్కు చేరువలో ఉంది.

    నిర్మాత నాగవంశీ ఫస్ట్ డే మాట్లాడుతూ ‘ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ అందుకున్నా ఆశ్చర్యం లేదు’ అన్నాడు. విజయ్ ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ ను సైతం ఈ సినిమా ప్రభావితం చేస్తుందంటే ఎంతలా క్రేజీ పొందిందో చూడవచ్చు.

    చిన్న హీరో స్థాయి నుంచి.. మిడ్ రేంజ్‌ హీరోలైన నాని, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, అడివి శేషుల సరసన చేరాడు సిద్ధు జొన్నలగడ్డ. తనకున్న రైటింగ్ స్కిల్స్ కు, నటనకు సిద్ధూ ఇంకా పెద్ద స్థాయికి చేరే అవకాశముంది.

    Share post:

    More like this
    Related

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Tillu Square : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ స్క్వేర్..?

    Tillu Square : మార్చి 29న విడుదలైన స్క్వేర్ మూవీ రూ....

    Siddu Jonnalagadda : జొన్నలగడ్డ సిద్దు వైపు చూస్తున్న సినీ నిర్మాతలు

    Siddu Jonnalagadda : థియేటర్లో తెరపై సినీ హీరో జొన్నలగడ్డ సిద్దు...

    Tillu Cube : టిల్లు క్యూబ్ తో అట్లుంటదట మరి!

    Tillu Cube : డీజే టిల్లు విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు...