30.6 C
India
Tuesday, April 30, 2024
More

    Siddu Jonnalagadda : జొన్నలగడ్డ సిద్దు వైపు చూస్తున్న సినీ నిర్మాతలు

    Date:

    Siddu Jonnalagadda
    Siddu Jonnalagadda

    Siddu Jonnalagadda : థియేటర్లో తెరపై సినీ హీరో జొన్నలగడ్డ సిద్దు కనిపించాడంటే నవ్వులే,నవ్వులు.తండ్రి కొడుకుల మధ్య జరిగే మాటలు కూడా కొట్లాడుకున్నట్టే ఉంటాయి.కానీ ఆ మాటలు మాత్రం ప్రేక్షకులను,ఇటు సిద్దు అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతాయి.మాటలను తెలంగాణ యాసలో మాట్లాడి యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో సినిమా పెద్ద ఎత్తున వసూళ్ల వైపు దూసుకెళుతున్నది.తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాను చూసిన పలువురు చిన్న నిర్మాతలు ఇప్పుడు జొన్నల గడ్డ సిద్దు హీరో వైపు చూస్తున్నారని సినీవర్గాల్లో  జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురు నిర్మాతలు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తితో ఉన్నారని సమాచారం.తొందరలోనే సిద్దు తో ఓ నిర్మాత సంస్థ కూడా సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.

    గడిచిన 19 రోజుల్లోనే అంచనాలాకు మించి లక్ష్యాన్ని దాటింది టిల్లు స్క్వేర్.తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు రావడంతో సినిమా నిర్మాత నాగవంశీ సంతోషంలో ఉన్నాడు.100 కోట్ల పైబడి వసూళ్లను సాదిస్తుందని కూడా కలలో అనుకోలేదు సినీ పరిశ్రమ.19 రోజుల కంటే ముందుగానే టిల్లు స్క్వేర్ సినిమా వంద కోట్ల కలెక్షన్లు సాధించి పెట్టి సినీ పరిశ్రమనే ఆశ్చర్యంలో  ముంచేసింది.బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసింది ఈ సినిమా అని పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది.

    విడుదలైన మూడు వారాల్లోనే 125 కోట్ల పైబడి వసూళ్లను చేపట్టిందంటే ఈ సినిమాను అటు ప్రేక్షకులతోపాటు,ఇటు అభిమానులు సైతం ఎంతగా ఆదరిస్తున్నారో చెప్పాల్సిన అవసరం కూడా లేదు.తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాల్లోనే 80 కోట్ల పైబడి వసూళ్లను చేపట్టి సినీ ఇండస్ట్రీ లో సంచలనం రేపింది.తమిళనాడులో 1.5 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో 8 కోట్ల రూపాయలు, మరొకొన్ని ఇతర రాష్ట్రాల్లో కే కలిపి 1.35 కోట్ల రూపాయల వసూళ్ల తో కొత్త చరిత్రను టిల్లు స్క్వేర్ చిత్రం సృష్టించింది. ఇతర దేశాల్లో సైతం విడుదల ఆయిన సిద్దు సినిమా ఇప్పటివరకు మూడు మిలియన్ డాలర్ల వసూళ్లను చేసి చిత్ర పరిశ్రమలో పోటీగా నిలిచిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

    బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అంచనాలకు మించి లాభాలను సాధిస్తోంది. సినీ ఇండస్ట్రీ ఊహించిన దానికంటే ఎక్కువగానే గడిచిన 19 రోజుల్లేనే 125 కోట్ల రూపాయల పైబడి వసూళ్ల వైపు దూసుకెళ్తూ పరిశ్రమలో కొత్త చరిత్రను సృష్టిస్తోంది.మొత్తం మీద ఈ సినిమా 40 కోట్ల రూపాయలతో నిర్మించగా, అనుకున్నదానికంటే అధికంగా లాభాలను సాధించడంతో ప్రస్తుత నిర్మాత తోపాటు మరికొందరు నిర్మాతలు సైతం హీరో జొన్నలగడ్డ సిద్ధుతో కొత్త సినిమా గురుంచి చర్చించడానికి సిద్ధంగా ఉన్నటు చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Hero Vishal : హిరో విశాల్ సంచలన వ్యాఖ్యలు.. చిన్న సినిమాలు తీయొద్దు

    Hero Vishal : హిరో విశాల్ తమిళ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని...

    Tillu Square : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ స్క్వేర్..?

    Tillu Square : మార్చి 29న విడుదలైన స్క్వేర్ మూవీ రూ....

    Tillu Cube : టిల్లు క్యూబ్ తో అట్లుంటదట మరి!

    Tillu Cube : డీజే టిల్లు విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు...