31 C
India
Thursday, May 16, 2024
More

    Earn Money Twitter : ట్విట్టర్ బంపరాఫర్.. క్రియేటర్లకు ఇకపై డబ్బులే.. డబ్బులు..!

    Date:

    Earn Money Twitter
    Earn Money Twitter

    Earn Money Twitter : కంటెంట్ క్రియేటర్లకు గూగుల్.. యూట్యూబ్.. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు తమకు వచ్చే యాడ్ రెవిన్యూలో కొంత భాగాన్ని చెల్లించేవి. కానీ ట్విట్టర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించేది. అయితే పెరుగుతున్న పోటీ కారణంగా ట్విట్టర్ సైతం కంటెంట్ క్రియేటర్లకు మనీ చెల్లించేందుకు రెడీ అవుతోంది.

    ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విట్టర్ ఆదాయ వనరుగా చూస్తున్న ఎలాన్ మస్క్ తమ ఖాతాదారులకు పెయిడ్ ఆప్షన్ తీసుకొచ్చి షాకిచ్చాడు. ట్విట్టర్ కొనుగోలుకు అయిన ఖర్చునంతటికీ వినియోగదారుల నుంచి రాబట్టే పనిలో పడ్డాడు.

    అయితే ట్విట్టర్ కు పోటీగా మేటా థ్రెడ్స్ యాప్ ను ఇటీవల తీసుకొచ్చింది. ఈ యాప్ ప్రారంభించిన ఏడు గంటల్లోనే కోటికిపైగా డౌన్ లోడ్ అయ్యాయి. వారంలోనే 10కోట్ల మంది వినియోగదారులు థ్రెడ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రధానంగా ట్విట్టర్ వినియోగదారులంతా థ్రెడ్స్ యాప్ వైపు చూస్తున్నారు.

    ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్విటర్ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. తమ ఖాతాదారులు థ్రెడ్స్ వైపు మరలకుండా ఉండేందుకు ఖాతాదారులకు బంపరాఫర్ ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్లకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంతో కొంత భాగాన్ని చెల్లించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

    అలాగే జూన్ 14 నుంచి స్పామ్ మెసేజ్ ల సంఖ్యను తగ్గించేలా కొత్త మెసేజ్ సెట్టింగ్ ను తీసుకురానుంది. ఈ సెట్టింగ్ కింద ఖాతాదారులు అనుసరించే వ్యక్తుల నుంచి సందేశాలు ప్రైమరీ ఇన్ బాక్సులో కన్పించనున్నాయి. ఏదిఏమైనా ట్విట్టర్ సైతం కంటెంట్ క్రియేటర్లకు మనీ సంపాదించుకునే అవకాశం కల్పించనుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Elon Musk Neuralink : మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఎలాన్ మస్క్ ప్రయోగాలు ఎటు దారి తీస్తాయో?

    Elon Musk Neuralink : మనిషి తన మెదడుతో ఎన్నో ఆవిష్కరణలు...

    Elon Musk : ఎలన్ మస్క్ ముక్కుపిండీ మరీ మిలియన్ డాలర్లు వసూలు

    Elon Musk : టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ గురించి...