33.2 C
India
Sunday, May 19, 2024
More

    BRO : 12 రోజులు కోమాలో ఉన్నా.. కళ్యాణ్ మామ ఒకటే చెప్పేవారు.. సాయి తేజ్ ఎమోషనల్!

    Date:

    Sai dharam tej Pawan kalyan
    Sai dharam tej Pawan kalyan
    BRO  పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘బ్రో’.. ఈ సినిమా ఈ వీకెండ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. జులై 28న ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. ఈ క్రమంలోనే మేకర్స్ వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు.
    త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఇక నిన్న రాత్రి బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లోకి పవర్ స్టార్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.. ఈ వేదికపై పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన స్పీచ్ నెట్టింట వైరల్ అవుతుంది..
    సాయి తేజ్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. కళ్యాణ్ మామయ్య ఫోన్ చేసి ఒక సినిమా చేయాలిరా అన్నాడు.. మల్టీస్టారర్ అని నువ్వు లీడ్ నేను సపోర్టింగ్ యాక్టర్ గా నటిస్తానని చెబితే నేను ఒప్పుకోలేదు.. వెంటనే ఇంటికి రమ్మని పిలిచాడు.. ఆ తర్వాత నన్ను కన్విన్స్ చేసాడు.. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నాకు యాక్సిడెంట్ అయ్యింది.
    12 రోజులపాటు కోమాలో ఉన్నాను.. ప్రతీ రోజు కళ్యాణ్ మామ నా దగ్గరికి వచ్చి నీకు ఏం కాదని చెప్పేవాడు.. ఆ మాటలు నాకు వినిపించేవి.. నా చేయి పట్టుకుని ఆ మాట చెప్పేవాడు.. థాంక్యూ మామయ్య థాంక్యూ సో మచ్ లవ్ యు అని సాయి తేజ్ ఎమోషనల్ అయ్యాడు.. ఈయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.. ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...