30.4 C
India
Tuesday, May 14, 2024
More

    AP : ఆ కంపెనీల ద్వారా కాంగ్రెస్ కు జగన్ ఫండింగ్.. అవేంటో తెలుసా?

    Date:

    jagan ponguleti srinivas reddy
    jagan ponguleti srinivas reddy

    AP ఏపీలో ఏ కాంట్రాక్టు పొందాలన్నా అది రాఘవ కన్ స్ట్రక్షన్స్ అయినా లేకపోతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్
    కంపెనీ అయి ఉండాల్సిందే. ఎటువంటి ప్రాజెక్టులు అయినా సరే ఈ రెండు కంపెనీలకే దక్కవల్సిందే. వీటిలో ఒకటైన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ ఎవరికి చెందిందో అందరికీ తెలిసిన విషయమే. అది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కుటుంబాలకు చెందినది.

    ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం రాక ముందు షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ చిన్న చిన్న ట్రాన్స్‌ఫార్మర్లు తయారు చేసేది. అదే కంపెనీ ప్రస్తుతం దాదాపు వేల కోట్ల కాంట్రాక్టులను కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. వైసీపీ అధినేత జగన్ కు  అత్యంత విశ్వాసపాత్రుడు అయిన పొంగులేటి తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. వాస్తవానికి  జగన్ అనుకుంటే ఆయనను బీజేపీలోకి పంపించగలడు.

    తెలంగాణలో అధికారం కోసం ఎదురుచూస్తున్న భాజపా తమ పార్టీలోకి పొంగులేటిని ఆహ్వానించింది కూడా.  కేవలం కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో కంగ్రెస్ లో చేరిపోయారు పొంగులేటి. ఈ చేరిక ముందు జగన్మోహన్ రెడ్డిని చాలా సార్లు కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరాక కూడా జగన్ ను కలిశాడని సమాచారం.

    ఇప్పటికీ పొంగులేటికి భారీ ఎత్తున కాంట్రాక్టులు అప్పచెప్తున్నాడు జగన్. రీసెంట్ గా భూగర్భంలో విద్యుత్ లైన్లు వేసే కాంట్రాక్ట్ ను పొందగలిగాడు. ఈ కాంట్రాక్టుల వెనుక అసలు కథ వేరే ఉందని పలువురు తెలుపుతున్నారు. రాబేయే ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా తనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు పొంగులేటి ద్వారా కాంగ్రెస్ కు ఫండ్ రూపంలో జగన్ ఇస్తున్నాడని రాజకీయ ప్రముఖులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన రాజకీయ లబ్ది కోసం ప్రజల సొమ్మును కాంట్రాక్టులకు ఉపయోగిస్తున్నాడని చాలా ఆరోపణలు వస్తున్నాయి. చిన్న చిన్న పనులు చేసే కాంట్రాక్టులకు బిల్లులు సరిగా ఇవ్వని జగన్ పొంగులేటికి సంబంధించిన కంపెనీలకు మాత్రమే మంజూరు చేయడంపై ఏపీ లో నిరసనలు వెలువెత్తుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...