26.7 C
India
Saturday, June 29, 2024
More

    BJP : ముందస్తు ఎన్నికలు బీజేపీని గట్టెక్కిస్తాయా?

    Date:

    BJP :
    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్ల పాలన పూర్తి  చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీలో నెలకొన్న అప్రదిష్టను తొలగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పలు మార్గాలు వెతుకుతోంది. దీంతో దేశంలో జమిలి ఎన్నికలకు బీజేపీ ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తేనే లాభం కలుగుతుందని భావించి ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. అలా జరిగితేనే పార్టీల ప్రభావాన్ని అడ్డుకోవచ్చు.
    పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెట్రో మంటలు, గ్యాస్ ధరలు కేంద్రాన్ని ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. దీంతో సామాన్యుడి జీవితం ఎంతో దుర్భరంగా మారుతోంది. అందుకే ముందస్తుకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికలకు వెళితేనే మంచిదనే అభిప్రాయం వెల్లడవుతుందని తెలుస్తోంది. మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తోంది.
    కేంద్రం తీరుపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఇది తీవ్రరూపం దాల్చితే మొదటికే మోసం వస్తుందని గ్రహించింది. అందుకే జమిలి ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాలని ఆలోచిస్తోంది. దీని కోసమే సర్వశక్తులు ఒడ్డాలని అనుకుంటోంది. దక్షిణాదిలో పట్టుకోసం పాకులాడుతున్నా అనుకూల ఫలితాలు రావడం లేదు.
    డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ముందే ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళితేనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండదు. దీనిపై పార్టీలోని నేతలంతా సమష్టిగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ముందస్తు ఎన్నికలు బీజేపీని గాడిన పడేస్తాయో లేక అగాధంలో పడేస్తాయో తెలియడం లేదు.

    Share post:

    More like this
    Related

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలు.. ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు తెలంగాణ రాజధాని...

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    YS Sharmila : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: వైఎస్ షర్మిల

    YS Sharmila : డాక్టర్లు అవుదామని ఆశతో ఉన్న 24 లక్షల...

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    Etela Rajender : ఎవరి కోసం ఈటలకు బీజేపీ పగ్గాలు

    Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను...