38.1 C
India
Sunday, May 19, 2024
More

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్-7 లోకి టేస్టీ తేజ ఎంట్రీ.. ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

    Date:

    bigg boss 7 telugu
    bigg boss 7 telugu

    Bigg Boss 7 Telugu : టేస్టీ తేజ పేరు నిన్నటి నుంచి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎందుకంటే ఈయన ఇప్పుడు బిగ్ బాస్-7లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ముందు నుంచే ఈయన పేరు వినిపిస్తూనే ఉంది కానీ కన్ఫర్మ్ కాలేదు. నిన్న హౌస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేశాడు మనోడు. దాంతో ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని అంతా ఆరా తీస్తున్నారు. ఈయన జబర్దస్త్ కమెడియన్. కానీ మిగతా కమెడియన్ల లాగా అంతగా పాపులర్ కాలేదు.

    కానీ మనోడి కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇతను జబర్దస్త్ తోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక టీమ్ కు పరిమితం కాకుండా అన్ని టీమ్ లలో చేస్తుంటాడు. మంచి ఫామ్ లోకి వస్తున్న సమయంలోనే మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. ఆ సమయంలో కొన్ని సినిమాల్లో నటించాడు. అక్కడ కూడా అనుకున్నంత అవకాశాలు రాలేదు. దాంతో యూట్యూబర్ గా మారిపోయాడు.

    టేస్టీ తేజ అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని అందులో ఫుడ్ ఐటమ్స్ గురించి వీడియోలు తీసేవాడు. సెలబ్రిటీలతో ఫుడ్ వీడియోలు చేసేవాడు. జబర్దస్త్ కంటెస్టెంట్లు, ఇతర సోషల్ మీడియా సెలబ్రిటీలతో మనోడు వీడియోలు తీయడంతో అవి బాగా వ్యూస్ సంపాదించుకున్నాయి. దాంతో మనోడికి యూట్యూబర్ గా మంచి క్రేజ్ వచ్చేసింది.

    ఆ క్రేజ్ తోనే తన యూట్యూబ్ ఛానెల్ లో ఇప్పటి వరకు 150కి పైగా సినిమాలను ప్రమోట్ చేశాడు. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాలను కూడా ప్రమోట్ చేశాడు. ఇప్పటి వరకు ఇండియాలోనే అత్యధిక సినిమాలను ప్రమోట్ చేసిన యూటూబ్యర్ గా మనోడికి రికార్డు ఉంది. అలా క్రేజ్ సంపాదించుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఆయన్ను బిగ్ బాస్-7లోకి తీసుకున్నారు. మరి ఇక్కడ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Punch Prasad : బిగ్ బాస్ ఎంట్రీపై పంచ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్

    Punch Prasad : బిగ్ బాస్ 8 జూన్ నెలలో ప్రారంభం...

    Nagarjuna : నాగ్.. చింతకాయ స్టోరీలు ఇంకెన్ని రోజులు?

    Nagarjuna : సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్...

    Hero Shivaji : పల్లవి ప్రశాంత్ గెలుపుపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..!

    Hero Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 ‘ఉల్టా పుల్టా’...