33.6 C
India
Monday, May 20, 2024
More

    Pavan Kalyan : పవన్ కళ్యాణ్ లవ్ ప్రపోజల్.. ట్విస్ట్ ఇచ్చిన యువతి.!

    Date:

    Pawan Kalyan :

    మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తన మ్యానరిజంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. యువత.. మహిళల్లో పవన్ కల్యాణ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి సైతం ఎంటరయ్యారు.

    అన్న చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’లో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో సినిమాలకే పరిమితం అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ తనదైన ముద్రతో పవన్ కల్యాణ్ ముందుకెళుతున్నారు.

    ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు ఓ అమ్మాయిని ప్రేమించినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ చైన్నైలో ఉంటున్నప్పుడు కంప్యూటర్ క్లాసులకు వెళ్లేవాడట. తన క్లాసులో ఓ అందమైన అమ్మాయి ఉండేదట. ఆమెతో మాట్లాడానికి.. లైన్లో పెట్టడానికి చాలామంది అబ్బాయిలు ప్రయత్నించేవారని చెప్పాడు.

    అయితే ఆ అమ్మాయి మాత్రం తనతో ఎక్కువ మాట్లాడేందుకు ఇష్టపడేదని చెప్పాడు. దీంతో తన స్నేహితుల ఆ అమ్మాయి తనను ప్రేమిస్తుందని చెప్పారని.. నువ్వు వెళ్లి తనకు లవ్ ప్రపోజ్ చేయమని చెప్పారని వెల్లడించారు. దీంతో తన పాత కారును రిపేర్ చేసుకుని మరీ సదరు అమ్మాయిని తీసుకొని లాంగ్ డ్రైవ్ కు వెళ్లినట్లు చెప్పాడు. చివరగా ఓ చోట కారు ఆపి ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడట.

    అయితే ఆ అమ్మాయి మాత్రం తనను చెడామడా తిట్టి.. నువ్వెంటీ.. నీ వయస్సు ఏంటీ? అంటూ తిట్టేసి వెళ్లిందని పవన్ చెప్పాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ మారింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...