24.7 C
India
Sunday, June 23, 2024
More

    Rwanda Man : నరహంతకుడు…వేశ్యలే టార్గెట్..సాక్షాలు లేక బెయిల్

    Date:

    Rwanda Man :
    రువాండా దేశంలో దారుణ ఘటన వెలుగుచూసింది. రువాండా రాజధాని కిగాలీలో ఓ నరహంతకుడి దుశ్చర్యలను పోలీసులు గుర్తించారు. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ ను కిగాలీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. రువాండా రాజధాని కిగాలీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి 14 మంది వేశ్యలను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని చంపేసేవాడు. వారి ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుంటాడు. అనంతరం తన ఇంట్లోని కిచెన్్ లో ఓ గొయ్యి తీసి పాతి పెట్టాడు. ఇలా వరుసగా 14 మందిని చంపాడు. 34 ఏళ్లు ఈ సీరియల్ కిల్లర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. కిచెన్ లో తవ్వి ఉన్నట్లుగా కనిపించడంతో అనుమానం వచ్చి మొత్తం తవ్వారు. అలా 10 మృతదేహాల అవశేషాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే సదరు నిందితుడు హతమార్చిన వారి సంఖ్య 14 వరకు ఉండొచ్చని కిగాలీ పోలీసులు అనుమానిస్తున్నారు. 10 మృతదేహాలను పాతి పెట్టాడని, మిగతా వాటిని యాసిడ్ పోసి కరిగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
    రుజువులు లేక పోవడంతో న బెయిల్
    సదరు నిందితుడిని పోలీసులు దోపిడీ, అత్యాచారం, ఇతర నేరాల ఆరోపణలపై జులైలోనే  అరెస్టు చేశారు.  కచ్చితమైన సాక్ష్యాధారాలు నిరూపించడంలో పోలీసులు విఫలం కావడంతో  లఅతనికి బెయిల్ మంజూరైంది. అయితే అతని నేరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.  రెండు రోజుల క్రితం పోలీసులు అతడిని తిరిగి అరెస్టు చేయడానికి అతను అద్దెకు ఉండే ఇంటికి వెళ్లి సోదా చేశారు. ఈ క్రమంలోనే వంటగదిలో గొయ్యి తీసిన ఆనవాళ్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సీరియల్ కిల్లర్ ఒక పథకం ప్రకారం వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. వేశ్యలైతే కుటుంబాలకు దూరంగా ఉంటారని, వారి గురించి ఆరా తీసేవారు తక్కువగా ఉంటారని, స్నేహితులూ పెద్దగా ఉండరన్న ఉద్దేశంతో వారిని ఇంటికి పిలిచి హత్య చేసేవాడని పోలీసులు భావిస్తున్నారు. హత్య చేయాలని నిర్ణయించుకునే ముందు కూడా అలాంటి వారినే ఎంపిక చేసుకునేవాడట. కొందరిని తన కిచెన్ గదిలోనే పాతిపెట్టాడని, మరికొందరిని యాసిడ్ పోసి కరిగించినట్లు పోలీసుల వద్ద నిందితుడు ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఆడవారితో పాటు పురుషులు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్త్రీ, పురుష వేశ్యలను ఇంటికి పిలిచి వారిని ప్రలోభపెట్టేవాడని, ఆ తర్వాత వారి గొంతు కోసి చంపేసే వాడని పోలీసులు తెలిపారు

    Share post:

    More like this
    Related

    Jagan : అసెంబ్లీకి జగన్ వస్తే కచ్చితంగా గౌరవం ఇస్తాం !

    Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా...

    Chandrababu : పవన్ ను అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు.. ఇప్పుడు 21 సీట్లు గెలిచారు

    Chandrababu : ‘పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం....

    Virat Kohli : ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. భారత కోచ్ సంచలన వ్యాఖ్యలు

    Virat Kohli : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్...

    CM Revanth Reddy : చంద్రబాబుతో పోటీ తథ్యం.. రేవంత్ రెడ్డి..

    Telangana CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఎన్నికైన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Choppadandi MLA Wife : చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

    ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం Choppadandi MLA Wife Sucide :...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...

    Crime News : హంతకులను పట్టించిన సెల్ ఫోన్.. అన్నీ ఆ ఫొటోలే..

    Crime News : కొందరు గృహిణుల ప్రవర్తన చూస్తే రాను రాను...

    40 Thousand Bill : అమ్మాయితో ఒకరోజు పరిచయం.. రూ. 40 వేల బిల్లు..

    40 Thousand Bill : కొత్త రకం మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది....