28 C
India
Friday, May 17, 2024
More

    Indian Medical Students : మెడిసిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఆ దేశాల్లోనూ ప్రాక్టీస్

    Date:

    Good News For Indian Medical Graduates
    Good News For Indian Medical students

    Indian Medical Students :

    భారత్ లోని మెడిసిన్ విద్యార్థులు ఇక ఇతర దేశాల్లోనూ పీజీ ప్రాక్టీస్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో జాతీయ మెడికల్ కౌన్సిల్ పదేళ్ల పదవీకాలం కోసం వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క గుర్తింపు పొందింది. ఈ గుర్తింపుతో దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు యూఎస్ , కెనడా, ఆస్ర్టేలియా, న్యూజీలాండ్ లాంటి దేశాల్లో పీజీ శిక్షణ, విద్యాభ్యాసానికి అవకాశం కల్పించింది.

    ప్రస్తుతం ఈ అక్రిడిటేషన్ కింద ప్రస్తుతం ఉన్న 706 మెడికల్ కళాశాలలు ది వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్(డబ్ల్యేఎఫ్ఎంఈ) గుర్తింపు పొందాయి. రాబోవు పదేళ్లలో ఏర్పాటయ్యే కళాశాలలకు కూడా ఈ గుర్తింపు లభిస్తుంది. ఒక ఈ గుర్తింపుతో ప్రపంచ వ్యాప్త విద్యార్థులకు కూడా భారత్ లో మెడిసిన్ చదువుకునే అవకాశం లభిస్తుంది.  దీంతో  దేశంలో వైద్య విద్య మరింత నాణ్యతా ప్రమాణాలను పెంచుకునే అవకాశం లభిస్తుంది.

    ఇక భారతీయ కళాశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలు సమకూరే అవకాశం ఉంటుంది. వైద్య విద్య పరమైన సహకారం అంతర్జాతీయంగా అందుతుంది. వైద్య విద్యలో నిరంతర అభివృద్ధి, ఆవిష్కరణలకు ఇది దోహదం చేస్తుంది. వైద్య బోధకులు, సంస్థల్లో నాణ్యత పెరుగుతుంది. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్  అనేది ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య యొక్క నాణ్యతను పెంపొందించడానికి అంకితమైన ప్రపంచ సంస్థ.

    ఎడ్యుకేషన్ కమిషన్ ఆన్ ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్ (ECFMG) అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రాథమిక సంస్థ, ఇది ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (IMGలు) లైసెన్సింగ్ విధానాలు మరియు నిబంధనలను పర్యవేక్షిస్తుంది.

    యూఎస్ ఎంఈని తీసుకోవడానికి రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేయడానికి ఇండియన్ విద్యార్థులు తప్పనిసరిగా ఈపీఎఫ్ఎంజీ ద్వారా ధ్రువీకరించబడాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ సాధారణంగా మెడికల్ ప్రోగ్రాం యొక్క 2వ సంవత్సరం పూర్తయిన తర్వాత యూఎస్ దశ 1 పరీక్షకు ముందు జరుగుతుంది. ఇక విదేశాల్లోనూ పీజీ ప్రాక్టీస్ ద్వారా  ఇండియన్ మెడిసిన్ విద్యార్థులకు మేలు జరగనుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Australia Visa : ఆస్ట్రేలియా వీసా నిబంధనలు మరింత కఠిన తరం..! 

    Australia Visa : తమ దేశంలోకి వెల్లు వేతుతున్న వలసలులో నివారించేందుకు...

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు..

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కెనడాలో...