34.7 C
India
Friday, May 17, 2024
More

    Vijay Devarakonda Next Movie : విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీలో శ్రీలీలకు బదులు రష్మిక

    Date:

    Vijay Devarakonda Next Movie
    Vijay Devarakonda Next Movie

    Vijay Devarakonda Next Movie : ఈ మధ్య శ్రీలీలకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోయిన్ లను సైతం వెనక్కి నెట్టి మరీ భారీ ప్రాజెక్టుల్లో ఛాన్సులను కొట్టేసింది. ఇటీవల గుంటూరు కారంలో మహేశ్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసిన చిన్నది రామ్ పోతినేని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా కనిపిస్తుంది.

    ఈ నేపథ్యంలోనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల నటించనుందనే వార్త రాగానే ఈ సినిమా ఆమె కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తుందని అంతా భావించారు. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో శ్రీలీల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తాజా సమాచారం. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు.

    విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. శ్రీలీల స్థానంలో రష్మిక మందన్నను తీసుకోబోతున్నారని, దీంతో రష్మికతో విజయ్ మూడోసారి జతకట్టనున్నారని తెలుస్తోంది.

    విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరూ మూడోసారి కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలుస్తోంది.

    ఇక శ్రీలీల ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని ‘స్కంద’ సినిమాలతో బిజీగా ఉంది.

    మరోవైపు రష్మిక ‘పుష్ప: ది రూల్’ అండ్ ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...