37.8 C
India
Saturday, May 18, 2024
More

    Credit Card Risks : క్రెడిట్ కార్డు వాడితే మనకు ఎలాంటి నష్టాలో తెలుసా?

    Date:

    Credit Card Risks
    Credit Card Risks

    Credit Card Risks : ఇటీవల కాలంలో బ్యాంకులు క్రెడిట్ కార్డుల వల విసురుతున్నాయి. మీరు క్రెడిట్ కార్డుకు అర్హులంటూ ఫోన్లలో వేధిస్తున్నారు. దీంతో ప్రలోభాలకు గురైతే అంతేసంగతి. క్రెడిట్ కార్డు తీసుకుంటే బ్యాంకు వారికే లాభాలు ఎక్కువ. మన చేతి చమురు వదలాల్సిందే. మనం ఏదైనా సూపర్ మార్కెట్ కు వెళ్లి ఒక వస్తువు తీసుకుందామని వెళ్లి పది రకాల వస్తువులు తీసుకుంటాం. ఇక క్రెడిట్ కార్డు ఉంటే ఆగుతామా? విచ్చలవిడిగా కొనేస్తాం. ఫలితంగా బిల్లు మోతమోగుతుంది. చేసిన అప్పులు తీర్చలేక కష్టాల్లో పడతాం.

    అందుకే మంచం ఉన్నంత వరకు కాళ్లు  చాపుకోవాలి. ఇంకా ఎక్కువ దూరం చాపితే ఇబ్బందులు రావడం ఖాయం. అందుకే మన ఇంటి బడ్జెట్ ను మన అంచనాల్లోనే ఉంచుకోవాలి. మన సంపాదనలో కేవలం ముప్పై శాతం మాత్రమే ఖర్చు చేయాలి. మిగతా డబ్బును ఇతర అవసరాలకు వినియోగించాలి. లేకపోతే మనం చిక్కుల్లో పడటం ఖాయం. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.

    వచ్చే వేతనం చాలక క్రెడిట్ కార్డ్ వాడితే మన సాలరీ మొత్తం అయిపోతే మినిమమ్ డ్యూ చెల్లిస్తుంటాం. ప్రతి నెల చెల్లిస్తూ పోతుంటే మన జీతం సరిపోదు. ఫలితంగా అప్పులు చేయాల్సి వస్తుంది. గొప్పలకు పోయి తప్పులు చేసే బదులు ఉన్నజీతంలోనే సర్దుకోవడం మంచిది. ఇలా చేస్తే మనకు ఇబ్బందులు రావు. కానీ మన సాలరీ మొత్తం ఖర్చు చేస్తే భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే క్రెడిట్ కార్డు వాడకం అంత సురక్షితం కాదు.

    ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎంత జీతం ఉంటే అంతలోనే సర్దుబాటు చేసుకోవాలి. లేకపోతే జీవితంలో చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డ్ మీద రుణం కూడా ఇస్తారు. కొందరు డబ్బులపై వ్యామోహంతో తీసుకుని తరువాత కష్టపడతారు. లోన్ అవసరమైతేనే తీసుకోవాలి. అంతేకాని డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో తీసుకుని ఖర్చు చేస్తే తరువాత కట్టే టప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని తెలుసుకుంటే మంచిది.

    Share post:

    More like this
    Related

    TS EAPCET-2024 : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదల

    TS EAPCET-2024 Results : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి....

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Suicide : క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక భార్య భర్తలు ఆత్మహత్య

    Suicide : మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో...

    Credit Cards : క్రెడిట్ కార్డ్ మినిమమ్ పే చేస్తున్నారా? ఇలా నష్టపోతారు..

    Credit Cards : బ్యాంకులు లింకప్ పూర్తవడంతో క్రిడిట్ కార్డులపై పడ్డాయి....

    Credit Card : క్రెడిట్ కార్డు ఖాతాదారుడు చనిపోతే బీమా వస్తుంది తెలుసా?

    Credit Card : మనం ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్...