Credit Card : ఈ టెక్నాలజీ కాలంలో ప్రతీ ఒక్కరూ ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నారు. 5 రూపాయల దగ్గర నుంచి ఆన్ లైన్ ద్వారానే కడుతున్నారు. సినిమా టికెట్లు బుక్ చేయడం దగ్గర నుంచి, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడం, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సభ్యత్వం తీసుకోవడం..వంటివి అందరికీ ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. కస్టమర్లకు లాభం చేకూరే యాక్సిస్ బ్యాంకు ఓ నిర్ణయం తీసుకుంది.
యాక్సిస్ బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ‘‘మై జోన్ క్రెడిట్ కార్డు’’ పేరుతో కొత్త క్రెడిట్ కార్డు ఎన్నో ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తోంది. దీని వల్ల నెలకు, ఏడాదికి దాదాపు 13 వేల రూపాయలు ప్రయోజనం పొందనున్నారు. ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేసే కస్టమర్లు దీన్ని షాపింగ్ క్రెడిట్ కార్డుగా కలిగి ఉంటారు. ఈ కార్డు ప్రయోజనాలు మీరు ఒకసారి లుక్కేయండి..
– సోని లివ్(sonyLiv) ప్రీమియం సబ్ స్క్రిప్షన్ రూ.999 స్వాగత ప్రయోజనం కలుగుతుంది.
– స్విగ్గీపై ఫ్లాట్ రూ.120 తగ్గింపు. కనీస ఖర్చు రూ.500, నెలకు రెండుసార్లు వర్తిస్తుంది. (గరిష్ట తగ్గింపు నెలకు రూ. 240 వరకు)
-పేటీఎం మూవీస్ లో ఒకటి కొనుగోలు చేస్తే రెండో టికెట్ పై 100శాతం తగ్గింపు పొందండి. గరిష్ట తగ్గింపు నెలకు 200.
– AJIO లో రూ.1000 వరకు తగ్గింపు కనీస ఖర్చు రూ.ఎంపిక చేసిన వాటిపై 2999 ప్రయోజనం.
– భారత్ లోని పార్టనర్ రెస్టారెంట్లలో 15 శాతం వరకు రూ.500 వరకు తగ్గింపుతో కూడిన డైనింగ్ డిలైట్ లు.
– రూ.400-4000 ఖర్చుల కోసం దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంప్ ల వద్ద 1 శాతం ఇంధన సర్ చార్జి మినహాయింపు.
– వార్షిక రుసుం మొదటి సంవత్సరం నిల్. రెండో సంవత్సరం నుంచి రూ.500.