
Credit Card Risks : ఇటీవల కాలంలో బ్యాంకులు క్రెడిట్ కార్డుల వల విసురుతున్నాయి. మీరు క్రెడిట్ కార్డుకు అర్హులంటూ ఫోన్లలో వేధిస్తున్నారు. దీంతో ప్రలోభాలకు గురైతే అంతేసంగతి. క్రెడిట్ కార్డు తీసుకుంటే బ్యాంకు వారికే లాభాలు ఎక్కువ. మన చేతి చమురు వదలాల్సిందే. మనం ఏదైనా సూపర్ మార్కెట్ కు వెళ్లి ఒక వస్తువు తీసుకుందామని వెళ్లి పది రకాల వస్తువులు తీసుకుంటాం. ఇక క్రెడిట్ కార్డు ఉంటే ఆగుతామా? విచ్చలవిడిగా కొనేస్తాం. ఫలితంగా బిల్లు మోతమోగుతుంది. చేసిన అప్పులు తీర్చలేక కష్టాల్లో పడతాం.
అందుకే మంచం ఉన్నంత వరకు కాళ్లు చాపుకోవాలి. ఇంకా ఎక్కువ దూరం చాపితే ఇబ్బందులు రావడం ఖాయం. అందుకే మన ఇంటి బడ్జెట్ ను మన అంచనాల్లోనే ఉంచుకోవాలి. మన సంపాదనలో కేవలం ముప్పై శాతం మాత్రమే ఖర్చు చేయాలి. మిగతా డబ్బును ఇతర అవసరాలకు వినియోగించాలి. లేకపోతే మనం చిక్కుల్లో పడటం ఖాయం. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
వచ్చే వేతనం చాలక క్రెడిట్ కార్డ్ వాడితే మన సాలరీ మొత్తం అయిపోతే మినిమమ్ డ్యూ చెల్లిస్తుంటాం. ప్రతి నెల చెల్లిస్తూ పోతుంటే మన జీతం సరిపోదు. ఫలితంగా అప్పులు చేయాల్సి వస్తుంది. గొప్పలకు పోయి తప్పులు చేసే బదులు ఉన్నజీతంలోనే సర్దుకోవడం మంచిది. ఇలా చేస్తే మనకు ఇబ్బందులు రావు. కానీ మన సాలరీ మొత్తం ఖర్చు చేస్తే భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే క్రెడిట్ కార్డు వాడకం అంత సురక్షితం కాదు.
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎంత జీతం ఉంటే అంతలోనే సర్దుబాటు చేసుకోవాలి. లేకపోతే జీవితంలో చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డ్ మీద రుణం కూడా ఇస్తారు. కొందరు డబ్బులపై వ్యామోహంతో తీసుకుని తరువాత కష్టపడతారు. లోన్ అవసరమైతేనే తీసుకోవాలి. అంతేకాని డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో తీసుకుని ఖర్చు చేస్తే తరువాత కట్టే టప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని తెలుసుకుంటే మంచిది.