32.3 C
India
Wednesday, May 15, 2024
More

    Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. సీక్వెల్ తో మెప్పించారా.. లేరా?

    Date:

    raghava lawrence and kangana ranaut chandramukhi 2 movie review
    raghava lawrence and kangana ranaut chandramukhi 2 movie review

    Chandramukhi 2 Review :

    ఈ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోలాహలంగా ఉంది.. అది ఎందుకో అందరికి తెలుసు.. ఈ రోజు పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి.. ఆడియెన్స్ ను మెప్పించడానికి వీకెండ్ కావడంతో హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ రోజు రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాల ప్రీమియర్స్ పడ్డాయి. మరి ఈ సినిమాలో చంద్రముఖి 2 ఒకటి. ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం..

    చంద్రముఖి సినిమాను ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు.. దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా కూడా ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ తగ్గలేదు.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి..

    2005లో రిలీజ్ అయిన ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేయగా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ సినిమా వచ్చిన 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కింది. రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించగా.. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.. మరి ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు చూసేద్దాం..

    కథ విషయానికి వస్తే.. ఈ సినిమా స్టోరీ అందరికి తెలిసిందే.. ఎందుకంటే ఇది చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది కాబట్టి మొదటి పార్ట్ కథ మొత్తం ఆడియెన్స్ కు తెలుసు.. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో వాసు ఎలా తెరకెక్కించాడు అని ఆడియెన్స్ ఉత్సాహంగా ఎదురు చూసారు.. ఈసారి కథ డైరెక్ట్ గా చంద్రముఖి స్వయంగా రంగంలోకి దిగి ఆ ఇంటికి వస్తుంది.. చంద్రముఖి కారణంగా ఫ్యామిలీ ఇబ్బంది పడడంతో లారెన్స్ వచ్చి ఆ చంద్రముఖిని ఎలా బంధించాడు? మొదటి పార్ట్ కు ఈ స్టోరీని ఎలా కనెక్ట్ చేసారు..? అసలు లారెన్స్ కు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వీరయ్య రాజుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ..

    ఇక ఈ సినిమా టెక్నీకల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ ప్లస్ అవుతుంది అనుకుంటే అస్సలు ఆకట్టుకోలేదు అనే చెప్పాలి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆహా అనేలా లేదు.. సన్నివేశాలను ఎలివేట్ చేసేలా కీరవాణి వినసొంపుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేక పోయారు. ఇక సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా ఉండి ప్రతీ షాట్ కూడా అద్భుతంగా వచ్చింది.. దీంతో విజువల్ గా బాగా అనిపించింది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి అన్ని సెట్స్ రియాలిటీగా వచ్చేలా మంచి లుక్ తీసుకు వచ్చాడు..

    నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. లారెన్స్, కంగనా తమ పాత్రలకు బాగా యాక్టింగ్ చేశారు.. మిగిలిన వారంతా కూడా తమ నటనతో ఆకట్టుకున్న కూడా అంత ఆకట్టుకునేలా సినిమాలో దమ్ము లేదని చెప్పాలి. సీక్వెల్ తీస్తున్నాం అంటే చాలా జాగ్రత్తలు అవసరం.. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు అంటే హైప్ భారీగా ఉంటుంది.. కానీ పి వాసు ఆ అంచనాలు రీచ్ కాలేక పోయారు..

    ఇక ఈ సినిమాలో హైలెట్ పాయింట్ ఏంటంటే.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి ఆడియెన్స్ ను బాగా అలరిస్తుంది.. కంగనా యాక్టింగ్ కూడా ఆడియెన్స్ ను కట్టి పడేస్తుంది.. అంతకు మించి పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే ఏమీ లేవు.. అయితే ఆడియెన్స్ మాత్రం ఒకసారి చూసేయవచ్చు..

    Share post:

    More like this
    Related

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raghava Lawrence : రైతులకు ట్రాక్టర్లు.. హామీ నెరవేర్చిన లారెన్స్

    Raghava Lawrence : కొలీవుడ్ హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంత...

    Raghava Lawrence : ఆ భయంకరమైన వ్యాధితో లారెన్స్ పోరాటం చేసారా.. అందుకే ఆ పని చేస్తున్నారా?

    Raghava Lawrence : రాఘవ లారెన్స్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు...

    Raghava Lawrence : రజనీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్ ఎందుకో తెలుసా?

    Raghava Lawrence : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం...

    Kangana Ranaut : భార్య వదిలేసిన స్టార్ హీరోతో నేను డేటింగ్ చేశా.. కంగన రనౌత్ హాట్ కామెంట్లు..!

    Kangana Ranaut : ఫైర్ బ్రాండ్ అనే పేరు కొంత మందికి మాత్రమే...