37.8 C
India
Saturday, May 18, 2024
More

    YCP Tickets Cut : టికెట్లు కట్.. వైసీపీలో వారికి నిరాశే..

    Date:

    YCP Tickets Cut
    YCP Tickets Cut, CM Jagan

    YCP Tickets Cut : ఏపీలో ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రతిపక్షాలను అధికార బలంతో ఇబ్బందుల్లోకి నెట్టి తాను మాత్రం సాఫీగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. వైనాట్ 175 అంటూ పార్టీ అధినేత, సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేస్తు్న్నారు. ప్రజాబలం ఎలా ఉన్నా ఇది మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నింపింది. అయితే ఇక్కడే వారికి అసలు ట్విస్ట్ మొదలైంది. అందరికీ టికెట్లు ఇవ్వబోనని జగన్ తేల్చేశారు. ఇక టిక్కెట్లు దక్కని వారెవరో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. దీంతో వారిలో అసంతృప్తి, నైరాశ్యం మొదలైంది.

    ఇక మంత్రులుగా ఉన్న నాలుగురిని లోక్ సభ కు పోటీచేయించేందుకు అధినేత నిర్ణయించారట.  ఇక మరికొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని, కొత్తవారికి అవకాశం కల్పిస్తానని నేరుగా చెబుతున్నారు. మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా ఎంపీలుగా పోటీ చేయించే అవకాశం కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం ఉన్నదని జగన్ చెబుతున్నా,మరి ఇంత భారీ మార్పులు ఎందుకని ఎమ్మెల్యేలు సీనియర్ల వద్ద ప్రస్తావిస్తున్నారని సమాచారం.

    అయితే ఒక సీనియర్ మంత్రి మాత్రం తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం తన కొడుకుకి ఇవ్వాలని కోరుతున్నారు. తర్వాత చూద్దాం అంటూ చెప్పాడట. ప్రస్తుతానికి సదరు సీనియర్ మంత్రి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇక ఒక సీనియర్ మంత్రిని ఎంపీగా పోటీ చేయాలని చెప్పడంతో పాటు అక్కడ మరో మంత్రి లేదా స్పీకర్ తో పోటీచేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ తన కుమారుడికి కూడా టికెట్ అడుగుతున్నట్లు సమాచారం. ఇక చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఇలాంటి మార్పలకు అవకాశమున్నట్లు తెలుస్తున్నది.

    దీంతో పాటు ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ను కదిరికి వెళ్లి పనిచేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. 2019లో హిందూపురంలో ఓడిపోయిన ఇక్బాల్ ను అక్కడ సమన్వయకర్తగా నియమించారు. అయితే అక్కడ ఆయనను తొలగించి, కొత్తగా దీపికకు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్బాల్ ను కదిరిలో గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారు. ఇక విశాఖ తూర్పు బాధ్యతను ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అప్పగించారు. రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ ను దించాలని యోచిస్తుండగా, ఆయన సమ్మతం తెలపడం లేదు. అయితే చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలను మార్చాలనే డిమాండ్ ఉంది. అసమ్మతి సెగలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. దీనిపై కూడా సీఎం జగన్ దృష్టి పెట్టినట్లు సమాచారం.

    అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, ఇక ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కర్నూల్, మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్కరికి టికెట్ దక్కే అవకాశం లేదని స్వయంగా సీఎం చెప్పినట్లు సమాచారం. ఇక ఏలూరు ఎంపీ ఈసారి పోటీ చేయరని, ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అక్కడ ఓ మాజీ మంత్రిని బరిలోకి దింపేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాలోనూ ఒక సీనియర్ ఎమ్మెల్యేను ఈసారి లోక్ సభ బరిలో దింపనున్నారు.

    Share post:

    More like this
    Related

    TS EAPCET-2024 : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదల

    TS EAPCET-2024 Results : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి....

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....