38.1 C
India
Sunday, May 19, 2024
More

    CM Disputes in Congress : కాంగ్రెస్ లో ‘సీఎం‘ల లొల్లి.. అప్పుడే మొదలెట్టేశారుగా..

    Date:

    CM Disputes in Congress
    CM Disputes in Congress

    CM Disputes in Congress : కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఏ రాష్ర్టాల్లో అయినా లీడర్లు తామే బెస్ట్ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇక తెలంగాణలో మరింత దారుణంగా ఉంటుంది. ఎవరికి వారే సీఎంలు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. వారి మధ్య ఐక్యత లేకపోవడమే బీఆర్ఎస్ కు నిజానికి బలంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని వర్గాలు మినహా చాలా మంది ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. కానీ అలా ప్రత్యామ్నాయంగా ఎదిగిన నేత ఏ ఒక్కరూ లేకపోవడమే ఇక్కడ బీఆర్ఎస్ కు బలం.

    అయితే ప్రస్తుత పోరు కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తున్నది. నేతలు కూడా కొంత సయోధ్యతో ముందుకెళ్తున్నారు. ఎక్కడా ఒకరిపై ఒకరు దూషించుకోవడం లేదు. టికెట్లు రానివారు కొంత అసంతృప్తికి లోనైనా, మెజార్టీ సీనియర్ నేతలు కొంత సంయమనం తో ఉన్నారు. అయితే తాజాగా అప్పుడే పార్టీ గెలిచిందనుకున్నారో ఏమో గాని తామే సీఎంలు అని ప్రకటించేస్తున్నారు. తాజాగా సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి సీఎం అయ్యే చాన్స్ వస్తుందంటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన ఈసారి బరిలో లేరు. తాను ప్రాతినథ్యం వహించే నాగార్జున సాగర్ నుంచి ఈసారి కుమారుడిని బరిలోకి దింపారు.

    అయితే పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ విషయంలో సీనియర్లను కట్టడి చేసింది. కట్టుబాట్లు దాటితే సీనియర్, జూనియర్ అయినా వేటే అన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు చాలా మందికి ఓ క్లారిటీ ఉంది. పార్టీని గెలుపు వరకుతీసుకెళ్లే సత్తా ఏ నేతకు ఉంది. ప్రజాకర్షణ ఎవరికి ఉందో అందరికీ తెలుసు. అయినా మేం సీనియర్లం అనే ట్యాగ్ తో కొందరు ముందుకెళ్లేందుకు ఇప్పుడే సిద్ధమవుతున్నారు. కష్టమొకరిది.. సోకకరిది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మరి సీఎం కేసీఆర్ కు ఇది వరంగా మారితే మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీని ఎవరూ కాపాడలేరు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై ఈసీకి ఫిర్యాదు

    RTC MD Sajjanar : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...