Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో ఓటు వేసి మంచి నేతను ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏ పార్టీ మంచిదో తెలుసుకుని ఓటు వేయడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు జుగుప్సకరంగా మారాయి. అన్ని గుడ్డలు ఒకే తాను ముక్కలే అన్నట్లు అందరు నీతిమాలిన నేతలే.. నిజాయితీగా ఉన్న వారు కరువయ్యారు.
అవినీతి, బంధుప్రీతి, అన్యాయం, అక్రమం ఇవే వారికి అవసరం. ఎప్పుడైనా సరే ఎదుటి వారిని తొక్కిపెట్టడమే వారికి తెలిసిన విద్య. ఎన్ని తప్పులు చేస్తే అంత గొప్ప నాయకుడు. ఎన్ని హత్యలు చేస్తే అంత గాంధీయ వాది. ఎన్ని అన్యాయాలు చేస్తే అంతటి నీతివంతుడు. ఇలా రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనే స్థాయికి దిగజారిపోయారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో పార్టీల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి సమస్తం పరజాతి పరాయణత్వం అన్నట్లు సాగుతోంది. దేశంలో నానాటికీ పరిస్థితులు దిగజారుతున్నాయి. ఏ పార్టీ అయినా తన కోసం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు కనిపించడం లేదు.
రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అన్నట్లుగా ఉంటోంది. దీంతో రాజకీయాలు నీచంగా తయారయ్యాయి. ఏ నేత అయినా నీతికి పట్టం కట్టడం లేదు. నిజాయితీ గురించి పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నీతిమాలిన రాజకీయాలు మనకు అవసరమా? అని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాజకీయాల గురించి ఆలోచిస్తే మనకే పిచ్చి లేవడం ఖాయం. ఏ నేత ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. ఎవరి పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు. ఈ క్రమంలో రాజకీయాలపై యువతకు కూడా ఇష్టం ఉండటం లేదు. ఎవరైనా మంచి డాక్టరో, లాయరో, సైంటిస్టో కావాలనుకుంటారు కానీ రాజకీయ నేత కావాలని ఎవరు అనుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు.