38.1 C
India
Sunday, May 19, 2024
More

    BJP Amit Shah Announcement : బీజేపీ గెలిస్తే బీసీ సీఎం..అమిత్ షా ప్రకటనతో ఆ ముగ్గురిపై చర్చ

    Date:

    BJP Amit Shah Announcement
    BJP Amit Shah Announcement

    BJP Amit Shah Announcement : తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే బీజేపీ గెలుస్తుందా.. ఓడుతుందా అనే అంశాలను పక్కన పెడితే ఒకవేళ అవకాశమొస్తే సీఎం అయ్యే అభ్యర్థులు ఎవరనే చర్చ మొదలైంది. అమిత్ షా చెప్పిన ఈ బీసీ అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ జరుగుతున్నది.  బీసీ కార్డును ప్లే చేసిన బీజేపీకి అవకాశం దక్కుతుందా.. లేదా అనేది మరో 36 రోజుల్లో తేలనుంది.

    ఇక ప్రస్తుతం సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై డిస్కషన్ మొదలైంది. అమిత్ షా అటు ప్రకటించగానే మీడియా, శ్రేణులు ఇదే టాక్ మొదలుపెట్టాయి. ఇక ఈ రేసులో బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ పేర్లు మొత్తానికి ట్రోల్ అవుతున్నాయి. ఇక ఈ రేసులో మాత్రం బండి, ఈటల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తున్నది. అయితే ఈటల విషయానికి వస్తే రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి. రాష్ర్టసాధన కోసం జరిగిన ఉద్యమంలోక్రియాశీలకంగా పనిచేశారు. 2003లో బీఆర్ఎస్ లో చేరి 2004, 2009, 2014.2018 ఎన్నికల్లో గెలిచారు. మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను విభేదించి, పార్టీని వీడారు. బీఆర్ఎస్ లో చేరారు. ఇక తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడమే తన లక్ష్యమని చెప్పారు. 2023 ఎన్నికల్లో నేరుగా సీఎం కేసీఆర్పైనే గజ్వేల్ లో పోటీకి దిగుతున్నారు. రాష్ర్ట రాజకీయాల్లో ఈటల కు మంచి ఆదరణ ఉంది. ఇదంతా ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.

    ఇక బండి సంజయ్ విషయానికొస్తే.. నిఖార్సైన బీజేపీ కార్యకర్త అని ఠక్కున చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ వరకు ఆయన ప్రస్తానం పై ఎక్కడా విమర్శలు లేవు. కరీంనగర్ కార్పొరేటర్ గా గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచి సత్తా చాటారు. పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించి ఏకంగా రాష్ర్ట అధ్యక్షుడు అయ్యారు. ఇక ఆ తర్వాత బీజేపీని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనేలా నడిపించారు. ఒక్కసారిగా బండి సంజయ్ ఇమేజ్ రాష్ర్టవ్యాప్తంగా పెరిగిపోయింది. ఆయన అధ్యక్షతనే హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక పార్టీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత బండిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు బీసీని సీఎం చేయాలనుకుంటే బండి కూడా రేసులో ఉండే అవకాశం ఉంది. ఇక బీజేపీలో సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ కూడ ఈ రేసులో ఉంటారు. గతంలో ఆయన హయాంలోనే పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయడం లేదని సమాచారం. మరి ఆయనకు అవకాశం దక్కుతుందా.. లేదా అనేది తేలాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    Amit Shah : ప్రజల తిరస్కరించడంతో నే చంద్రబాబును మళ్లీ NDA లోకి వచ్చాడు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    గతంలో బిజెపిని తిట్టిన చంద్రబాబు నాయుడుతో ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారని...