37.7 C
India
Saturday, May 18, 2024
More

    Parliamentary Panel : వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించాలి.. కేంద్రానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు!

    Date:

    Parliamentary Panel
    Parliamentary Panel, couples

    Parliamentary Panel : కొన్ని చట్టాలు, న్యాయమూర్తుల తీర్పులతో హిందూ వివాహ వ్యవస్థ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని కేంద్రం వీటికి సవరణలు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. వ్యభిచారం, స్వలింగ సంపర్కం నేరాలా? కాదా? అన్న దానిపై చర్చ కొనసాగుతోంది. ఇవి నేరాలు కాదని  2018లో సుప్రీం కోర్టు స్పష్టం చేస్తూ ఐపీసీ 497, 377లను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో వీటిని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది.

    ఐపీసీ స్థానంలో వచ్చే భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో ఈ చట్టాలను మళ్లీ పునరుద్ధరించాలని కమిటీ కోరింది. వీటి వల్ల హిందూ వివాహ వ్యవస్థకు ఇబ్బందుల్లో పడుతుందని శుక్రవారం (అక్టోబర్ 27) ఏర్పాటు చేసుకున్న సమావేశంలో చర్చించింది. వీటితో పాటు భాగస్వామి సమ్మతి లేకుండా జరిగే స్వలింగ సంపర్కాన్ని కూడా నేరంగా పరిగణించాలని కోరనుందని తెలుస్తోంది. ఇటీవల సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదని ఐపీసీ 377ను కొట్టివేసింది. ఐదేళ్ల కిందట ఇద్దరి సమ్మతితో కొనసాగే వ్యభిచారం కూడా నేరం కాదని సుప్రీం తెలిపింది. ఈ విషయంలో ఈ రెండు సెక్షన్లను మరింత స్ట్రాంగ్ చేయాలని కమిటీ కేంద్రాన్ని కోరునున్నట్లు తెలుస్తోంది.

    497 ఎందుకు తొలగించారు?
    వ్యభిచారంకు సంబంధించి ఐసీపీ 497ను సుప్రీం కోర్టు 2018లో కొట్టేసింది. ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం ‘వ్యభిచారం నేరం కాదు కాకూడదు’ అంటూ తీర్పు చెప్పింది. ఒక వివాహితతో వ్యక్తి లైంగిక సంబంధం పెట్టుుకుంటే అది రుజువైతే.. ఆ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. లైంగిక సంబంధం పెట్టుకున్న మహిళకు ఎటువంటి శిక్ష లేదు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం వ్యభిచారం కేసులో ఒకరు మాత్రమే బలవుతున్నారని భావించి సెక్షన్ 497ను కొట్టేసింది. దీంతో భాగస్వామి అనుమతితో సెక్స్ జరిగితే అది నేరంగా పరిగణింపబడదు. ఈ సెక్షన్ స్థానంలో మరింత బలమైన చట్టాన్ని తీసుకురావాలని కమిటీ కేంద్రానికి సూచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arunachal Pradesh : బాలికలతో వ్యభిచారం.. అరెస్టయిన వారిలో ప్రభుత్వ అధికారులు

    Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్...

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...