39 C
India
Sunday, May 19, 2024
More

    BJP Ideas for Trump : ట్రంప్ కు బీజేపీనే ఆదర్శమా.. అదే ఎజెండా అమలు చేస్తున్నారా..?

    Date:

    BJP ideas for Trump
    BJP ideas for Trump in USa

    BJP ideas for Trump in US : అమెరికా మాజీ అధ్యక్షుడు మోదీ ఎజెండాను ఆదర్శంగా తీసుకున్నారా అనే అభిప్రాయం ఇప్పుడు అమెరికాలో వినిపిస్తున్నది. నిజానికి ఇండియాలో దీనిని మోదీ ఎజెండా అని కొందరు, ఆర్ఎస్సెస్  ఎజెండా అని మరికొందరు, హిందూత్వ ఎజెండా అని ఇంకొందరు భావిస్తుంటారు. అయితే ఇప్పుడు అమెరికాలో కూడా ట్రంప్ ఇదే ఎజెండాతో ముందుకెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తున్నది.

    ఆయన అమెరికాలో ముస్లిం వ్యతిరేక ప్రకటనల ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి అమెరికాకు పౌరుల రాకపోకల నిషేధాన్ని పునరుద్ధరిస్తానని ప్రకటించారు. రిపబ్లికన్ యూదు కమిటీ సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేసినట్లు తెలుస్తున్నది. అధికారంలోకి రాగానే మరోసారి తన నిర్ణయాన్ని పునరుద్ధరిస్తానని ఆయన ప్రకటించి, సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యోమెన్, ఇరాక్, సూడాన్ వంటి దేశాలకు మూములు ప్రజలు కూడా అమెరికాలో అడుగు పెట్టకుండా ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంక్షలు విధించారు. బైడెన్ వచ్చాక వీటిని ఎత్తేశారు. ఇప్పుడు తాజాగా ట్రంప్ మళ్లీ అదే ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చాక రెండో రోజే నిషేధాన్ని పునరుద్ధరిస్తానని చెప్పారు.  అయితే ముస్లిం వ్యతిరేక ప్రకటనల ద్వారా ఆయన అక్కడి ప్రజల ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చూస్తే ఇండియాలో బీజేపీ హిందూత్వ ఎజెండా గుర్తుకు వస్తున్నదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి వ్యవహార శైలి భవిష్యత్ లో ప్రజల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Google News : గూగుల్‌పై భారత్‌ కన్నెర్ర.. మోదీపై జెమిని వ్యాఖ్యలకు కౌంటర్

    Google News : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ వెనకబడింది....

    Donald Trump : ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ఆయన మానసిక పరిస్థితి సరిపోదా?

    Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వేళయింది. అభ్యర్థుల్లో వేడి...

    Donald Trump : యూఎస్ తొలి ఎన్నికల్లో బోణి కొట్టిన ట్రంప్.. నిక్కీ, వివేక్ అవుట్

    Donald Trump : అమెరికాలో నాలుగేండ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనే విషయం...

    Donald Trump : న్యూయార్క్ కోర్టులో ట్రంప్ కు 4  లక్షల డాలర్ల జరిమానా

    Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు...