37.7 C
India
Saturday, May 18, 2024
More

    Prabhas Records : రికార్డుల మోత మోగిస్తున్న ప్రభాస్.. ఏఏ సినిమా ఎంత ఎంత వసూలు చేస్తుందంటే?

    Date:

    Prabhas Records
    Prabhas Movie Records

    Prabhas Records : సలార్: సీజ్ ఫైర్ : ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవగా, మిడ్ నైట్ షోస్ లో రిలీజై ఫుల్ హౌస్ లకు ఓపెనింగ్స్ వచ్చాయి. థియేటర్లలో ఫుల్ జోష్ లో రన్ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి (మూడు రోజులు) ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రన్ ఇంకా కొనసాగుతోంది, ఫుల్ రన్ పూర్తయ్యేసరికి రూ. 1000 కోట్లను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.

    డంకీ: రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం డంకీ. షారుఖ్ రెండు చిత్రాల మాదిరిగా కాకపోయినా థియేటర్లలో మంచి వసూళ్లనే రాబడుతోంది. విడుదలైన 4 రోజుల తర్వాత డంకీ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.157.22 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. రన్ ఇంకా కొనసాగుతోంది, క్రిస్మస్, న్యూ ఇయర్ మూడ్ ను సద్వినియోగం చేసుకుంటూ ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

    యానిమల్: రణబీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ నుంచి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
    విడుదలైన 24వ రోజు ముగిసే సరికి ఈ చిత్రం రూ.860 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ రూ.1000 కోట్ల మార్కును అందుకుంటుందనే అంచనాలను పెట్టుకున్నారు మేకర్స్. కానీ సలార్, డంకీ వంటి సినిమాలు ఎక్కువ స్క్రీన్లను ఆక్రమించి బలంగా రన్ అవుతుండడంతో అంతమేరకు వసూలు కష్టమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఆక్వామాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్: హాలీవుడ్ వెంచర్ నిజంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే సత్తా ఉన్న సినిమా. అయితే సలార్, డంకీ వంటి ఇతర దేశీయ పెద్ద చిత్రాల దెబ్బతో ఈ హాలీవుడ్ చిత్రం బాక్సాఫీస్ పోరులో నిలబడలేకపోయింది. అంచనాలతో పోలిస్తే ట్రాక్షన్ అంతంతమాత్రంగానే ఉండడంతో కలెక్షన్లు కూడా టాప్ కు తీసుకెళ్లేంత ప్రోత్సాహకరంగా కనిపించడం లేదు.

    హాయ్ నాన్నా: నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం థర్డ్ వీకెండ్ కంప్లీట్ చేసుకునే వరకు దాదాపు రూ.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫాదర్ సెంటిమెంట్, సున్నితమైన కథనంతో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించిన తెలుగు సినిమాగా నిలిచింది.

    ‘సలార్’, ‘డంకీ’ వంటి పెద్ద సినిమాల మధ్య ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో తన పట్టును నిలుపుకోగలిగింది. ఈ వీకెండ్ నాటికి థియేటర్లలో ఈ ఫుల్ రన్ ముగిసే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...