37.8 C
India
Saturday, May 18, 2024
More

    South Vs North Movies : మనం హిట్లు కొడ్తున్నామని.. వారిని తక్కువ అంచనా వేస్తామా?

    Date:

    South Vs North Movies
    South Vs North Movies

    South Vs North Movies : ఇండియాలో సౌత్ సినిమాల హవా నడుస్తోంది. షారుఖ్ ‘డంకీ’కి సలార్ దమ్కీ ఇచ్చిందని సౌత్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇప్పటికే బహుబలి, కేజీఎఫ్, త్రిపుల్ ఆర్, కాంతారా.. ఇలా కొన్ని సినిమాలు బాలీవుడ్ ను కూడా షేక్ చేశాయి.  రాబోయే ఓ ఐదారు సినిమాలు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టానున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. కల్కి, దేవర, కాంతారా-2, పుష్ప-2…లాంటి చిత్రాలు, అలాగే రామ్ చరణ్-శంకర్, రాజమౌళి-మహేష్ బాబు, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే మూవీలు కూడా అద్దరగొట్టబోతున్నాయనే టాక్ నడుస్తోంది. బాలీవుడ్ పై సౌతిండియా మూవీల దండయాత్ర అంటూ కొందరు హెడ్ లైన్స్ కూడా పెడుతున్నారు.

    అయితే ఈ సినిమాలతో మనమే తోపులం అనుకోవడం పొరపాటే. దశాబ్దాలుగా బాలీవుడ్ తన సినిమాలతో ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటింది. మన దర్శకులు బాలీవుడ్ దర్శకులకు పాఠాలు చెపుతున్నారని అనడం కూడా వెర్రితనమే అవుతుంది. ఉదాహరణకు కాంతారా ఫస్టాఫ్, సెకండాఫ్ మొదట్లో అంతా ఫక్తు ఓ కన్నడ, తెలుగు మూవీలాగే ఉంటుంది. ఇక చివరి అరగంట సన్నివేశాలే.. ఆ సినిమాను పాన్ ఇండియన్ మూవీగా చేశాయి. ఆ సన్నివేశాలే అక్కడి జనాలను మెప్పించాయి.

    South Movies
    South Movies

    ఇక ప్రశాంత్ నీల్, వంగా సందీప్ రెడ్డి.. వీరి దర్శకత్వ ప్రతిభ రక్తపాతాలు, బీభత్సమైన హీరోయిజం, అసభ్యపదజాలాలు, వెగటు సీన్లు .. ఇది వీరి మార్క్. వీరికి ఆరోగ్యకరమైన కామెడీ, హార్ట్ టచబుల్ రొమాంటిక్ సీన్లు తీయలేరు. ఇక మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడు కూడా తమిళ వాసన నుంచి బయటపడలేదు. అందుకే పొన్నయిన్ సెల్వన్ ఒక్క తమిళులకు తప్ప ఇంకెవరికి నచ్చలేదు. కాకపోతే కొన్ని సన్నివేశాలను ఆయన అద్భుతంగా తీయగలరు. అయితే ఆయన మూవీలు పాన్ ఇండియన్ లెవల్లో ఇప్పుడు ఆడే పరిస్థితి లేదు. ఇక రాజమౌళి మాత్రమే కాస్త అన్ని రకాల సినిమాలు తీయగలడు. రొమాంటిక్ సీన్స్, కామెడీ కూడా బాగా తీయగలడు. ఇక నాగ్ అశ్విన్ ‘మహానటి’ని ఓ తెలుగు సినిమాలాగా బాగానే తీర్చిదిద్దాడు గాని పాన్ ఇండియా అనుభవం ఆయనకు లేదు. కల్కిని ఎలా తీస్తాడో చూడాలి.

    ఇలా మన దర్శకులు ప్రతిభావంతులే.. అయినా గాని ఎప్పుడూ ఒకే ఫార్ములా పనిచేస్తుందని అనుకోవద్దు. బాలీవుడ్ మూవీల్లో క్రియేటివిటీకి, భారీతనానికి ఢోకా లేదు. బాలీవుడ్ సినిమాలకు ఉత్తరాది అంతట రీచ్ ఉంటుంది. మన సినిమాలకు ఉండదు.  బాలీవుడ్ సినిమాలకూ మన దగ్గర విపరీతమైన క్రేజే ఉంటుంది. వారిని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. హిందీలో దశాబ్దకాలం కిందటే ఐదు వందలు,
    వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినా లగాన్, గదర్ ఏక్ ప్రేమ్ కథ..లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అంటే అప్పటి వెయ్యి కోట్లు అంటే ఇప్పటి టికెట్ ధరల్లో చెప్పుకుంటే ఐదు వేల కోట్లకు పైమాటే.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Super Star Rajinikanth : ఒక్క సినిమాకే రూ.280 కోట్లు..?

    ‘కూలీ’ సినిమాకు రజనీకాంత్ పారితోషికం Super Star Rajinikanth : భారతదేశంలో...

    Bollywood Movie Offers : ఆఫర్లు.. మరింత దిగజారుస్తున్నాయా?

    Bollywood Movie Offers : 2024 ప్రారంభం బాలీవుడ్ అంతగా కలిసి...

    Bollywood Producer : తారక్ తో సినిమా చేయాలని బాలీవుడ్ అగ్ర నిర్మాత తంటాలు

    Bollywood Producer : బహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్...

    Pushpa 2 : పుష్ప ను చూసి భయపడుతున్న బాలీవుడ్

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్...