41.5 C
India
Monday, May 6, 2024
More

    Super Star Rajinikanth : ఒక్క సినిమాకే రూ.280 కోట్లు..?

    Date:

    • ‘కూలీ’ సినిమాకు రజనీకాంత్ పారితోషికం
    Super Star Rajinikanth
    Super Star Rajinikanth

    Super Star Rajinikanth : భారతదేశంలో సినిమాల బడ్జెట్ ఆకాశాన్ని తాకుతోంది.  ఒకప్పుడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక సినిమా తీస్తున్నారంటే, అందరూ గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఇదంతా కామన్ అయింది. సినిమాల రేంజ్ పెరిగిపోయింది. దీంతో హీరోల రెమ్యనరేషన్ భారీగా పెరిగింది. ఇప్పుడు 100 కోట్ల పారితోషికం కామన్ అయింది.

    అయితే ఒక హీరో ఓ సినిమాలో నటించేందుకు ఏకంగా రూ.280 కోట్లు తీసుకుంటున్నాడు. అది ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్.  ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి రజనీకాంత్ ఏకంగా రూ.260 నుంచి రూ.280 కోట్లు వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

    ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రజనీకాంత్ నిలుస్తారు.ఇటీవల విడుదల చేసిన కూలీ టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

    రజనీకాంత్ నటించిన ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా హిట్టయ్యాయి. ఆయన అప్పుడు, ఇప్పుడు ఒకే రకమైన స్టైల్, క్రేజ్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వయసు 73 ఏళ్లు. అయినప్పటికీ వరుస సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఈ వయసులో దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రికార్డు సృష్టిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    Godzilla x Kong : గాడ్జిల్లా x కాంగ్ కలెక్షన్ల వర్షం

    Godzilla x Kong : గాడ్జిల్లా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది....

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    Bernard Hill : ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

    Bernard Hill : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bollywood Movie Offers : ఆఫర్లు.. మరింత దిగజారుస్తున్నాయా?

    Bollywood Movie Offers : 2024 ప్రారంభం బాలీవుడ్ అంతగా కలిసి...

    Bollywood Producer : తారక్ తో సినిమా చేయాలని బాలీవుడ్ అగ్ర నిర్మాత తంటాలు

    Bollywood Producer : బహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్...

    Pushpa 2 : పుష్ప ను చూసి భయపడుతున్న బాలీవుడ్

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్...

    Box office : 35 కోట్ల బడ్జెట్, 50 కోట్లు కూడా రాలేదా..?  ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే?

    Box office : యానిమల్, జవాన్, పఠాన్, గదర్ 2 లాంటి...