36.8 C
India
Tuesday, April 30, 2024
More

    Pushpa 2 : పుష్ప ను చూసి భయపడుతున్న బాలీవుడ్

    Date:

    Pushpa 2
    Pushpa 2

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప.  ఈ సినిమా సక్సెస్  సౌండ్ సౌత్ తో పాటు బాలీవుడ్ ని మోతెక్కించింది. ఈ సినిమా వరకు అల్లు అర్జున్ మార్కెట్ తెలుగుతో పాటు  మలయాళంలో మాత్రమే ఉండేది. పుష్ప తో ఒక్క సారిగా పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్.

    ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప ది రూల్..
    బాహుబలి సిరీస్ నుంచి సౌత్ సినిమాలు బాలీవుడ్ పై దండెత్తుతున్నాయి. గతంలో సౌత్ మూవీస్ అడపాదడపా హిట్టయినా వన్ మూవీ వండర్ అని బాలీవుడ్ గేలి చేసేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. భారీ బడ్జెట్ తో పాటు చిన్న సినిమాలు కూడా బాలీవుడ్ తెరపై కళకళలాడుతున్నాయి.  ఇక పుష్ప మరోసారి  బాలీవుడ్ ను రూల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రకటించిన డేట్ ప్రకారం బాలీవుడ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. కానీ పుష్ప మాత్రం తగ్గనంటున్నాడు. ఫిక్స్ చేసిన డేట్ కి కచ్చితంగా వస్తానంటున్నాడు.

    బాలీవుడ్ స్టార్లు వెనకడుగు
    అనౌన్స్ చేసిన డేట్ ను ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని పుష్ప నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో అదే టైమ్ కి రిలీజ్ చేయాలనుకున్న బాలీవుడ్ సినిమాలు మరో డేట్ ను వెతుక్కుంటున్నాయి. వాటిలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ మూవీ సింగం అగైన్.  సింగం ఫ్రాంచైజీ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నది.  కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉన్నా ఉత్తరాది మార్కెట్లలో అజయ్ క్రేజ్ వల్ల  సింగం అగైన్ కి కలెక్షన్ల పరంగా ఎలాంటి డోకా ఉండదనుకున్నారు. కానీ పుష్ప కి వస్తున్న బజ్ తో ఇప్పుడు సమీకరణాలన్నీ మారిపోతున్నాయి.  ఇక చేసేదేమీ లేక మరో డేట్ కి మార్చకోవడమే ఉత్తమమని హీరోతో పాటు దర్శకనిర్మాతలు పునరాలోచనలో పడ్డారు.

    పాన్ ఇండియా రేంజ్ లో  రిలీజ్ సిద్ధమవుతున్న పుష్ప 2కు  అడ్డంకి తొలగినట్లే. మొదటి భాగం తెచ్చిన క్రేజ్ దృష్ట్యా హిందీ నుంచి హక్కుల కోసం పోటీ కనిపిస్తున్నది. ఎగ్జిబిటర్లు కేజీఎఫ్ ని మించి వసూళ్లు రాబడుతందని అందరూ భావిస్తున్నారు. ఈ మధ్య రిలీజైన టీజర్ లో అల్లు అర్జున్ గెటప్ చూసి విశ్లేషకులు నోరెళ్ల బెట్టారు. ఈ మాస్ కి బాలీవుడ్ మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని అంటున్నారు. ఆగస్ట్ 15 పుష్ప 2 వచ్చాక ఆ స్థాయిలో రిలీజ్ అయ్యే సినిమా రెండు వారాల దాకా ఏదీ లేదు. సో మొదటి వారం కలెక్షన్లకు ఎలాంటి డోకా లేకున్నా హిట్ టాక్ వస్తే బాలీవుడ్ లో సరికొత్త కలెక్షన్ల రికార్డును పుష్ప సృష్టించడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి...