31.9 C
India
Monday, May 6, 2024
More

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Date:

    Allu Arjun
    Allu Arjun

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తనకంటూ సొంత స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఏ టైమ్ లో  పుష్ప  పార్ట్ 2 కు క్యాప్షన్ గా ది రూల్ అని పెట్టారో అది నిజం చేస్తున్నాడు. పుష్ప-2 కు ఆ రేంజ్ లో బాలీవుడ్ లోనూ మార్కెట్ అవుతున్నది. ప్రీ బిజినెస్ చూస్తుంటే సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ ను రూల్ చేస్తున్నాడా అనే టాక్ వినిపిస్తున్నది.

     టీనేజ్ లో ఎంట్రీ..
    అల్లు అర్జున్ తన టీనేజ్ లో చిన్న క్యారెక్టర్ లో మెరిశాడు. అతనిలోని డ్యాన్స్ ఈజ్ చూసి మెగా కాంపౌండ్ నుంచి మరో మాస్ హీరో రాబోతున్నాడని ఊహించారు. తన మామయ్య మెగాస్టార్  చిరంజీవి నటించిన డాడీ సినిమాలో బన్నీ ఓ చిన్న రోల్ చేశారు.అందులో చిరంజీవి డ్యాన్స్ క్లాస్ లో శిష్యుడిగా యాక్ట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు.  అప్పటికి బన్నీ వయసు 16 ఏళ్లు.   ఆ తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకేంద్రుడు రాఘవేందరరావు డైరెక్షన్ లో గంగోత్రి సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు.  రాఘవేంద్రరావు లాంచ్ చేసిన హీరోలందరూ  స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. అదే కోవలో అల్లు అర్జున్ కూడా సినిమా సినిమా కి తన రేంజ్ ను పెంచుకుంటున్నాడు.

    ఆయనంటే భయమట..
    టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాల్లో సూపర్ హిట్ మూవీ పెళ్లాం ఊరెళితే. వేణు, శ్రీకాంత్, సునీల్  లీడ్ రోల్స్ చేశారు. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.ఈ మూవీకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా తన కంటూ సెపరేట్ రికార్డు క్రియేట్ చేసుకున్నాడు.  ఈ సినిమా నిర్మాణంలో అల్లు అరవింద్ కూడా భాగస్వామి. తండ్రి అరవింద్ సూచనల మేరకు అల్లు అర్జున్ ఈ సినిమాకు  అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.  ఆ సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి అంటే అల్లు అర్జున్ కు చాలా భయం ఉండేదట. ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కృష్ణారెడ్డి సినిమాలు ఎంత సరదాగా సాగిపోతాయో అందరికీ తెలిసిందే. కానీ షూటింగ్ టైమ్ లో మాత్రం వర్క్ ఇంటెన్స్ డైవర్ట్ కాకుండా తన స్టాఫ్ తో స్ట్రిక్ట్ గా ఉంటాడట. దీంతో  డైరెక్షన్ టీమ్ లో ఉన్న బన్నీకి తనకు తెలియకుండానే ఆయనంటే ఒకరకమైన భయం మొదలైంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...