34.1 C
India
Saturday, May 18, 2024
More

    Teenmar Mallanna : పార్లమెంట్ బరిలో తీన్మార్ మల్లన్న.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ!

    Date:

    Teenmar Mallanna
    Teenmar Mallanna

    Teenmar Mallanna : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడప్పుడూ వినిపించే పేరు ‘తీన్మార్ మల్లన్న’ (చింతపండు నవీన్ కుమార్). V6 లోని ‘తీన్మార్ న్యూస్’ ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి తీన్మార్ మల్లన్నగా పేరు వచ్చింది. ఇది అందరికీ తెలిసిందే.. ఛానల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జర్నలిస్ట్ గా కొనసాగుతూ రాజకీయాల్లో కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేశాడు. కానీ, రెండో స్థానంలో నిలిచాడు.

    అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మల్లన్న కాంగ్రెస్ లో చేరాడు. ఈ మేరకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఆయన ప్రచారం చేసిన అన్ని సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆయనపట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలికి (ఎమ్మెల్సీ)కి పంపుతారని అప్పట్లో ప్రచారం జరిగింది.

    తీన్మార్ మల్లన్న లేదంటే కోదండరామ్ ఆయనకూడా కాదనుకుంటే అకునూరి మురళికి అవకాశం దక్కనుందని ప్రచారం జరుగుతుంది. కానీ, దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే మరో నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే మల్లన్నను పార్లమెంట్ భరిలో నిలబెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి ఎంపీ సీటు కేటాయించనున్నారని పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మద్దుతు కూడా కూడగడుతున్నట్లు తెలుస్తోంది.

    అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మల్లన్న పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా వెళ్లిన మల్లన్న ఎన్నికల సందర్భంగా ప్రచారంలో కలిసి పని చేశారు. వీరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు కూడా ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ అనుకూల పవనాల నేపథ్యంలో భువనగిరి ఎంపీ టికెట్ తీన్మార్ మల్లన్నకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇదే స్థానంలో బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...