40.2 C
India
Sunday, May 19, 2024
More

    Anganwadi workers : జీతాల పెంపు బటన్ నొక్కండి.. లేదంటే మేం నొక్కితే మీ అడ్రస్ గల్లంతే.. అంగన్వాడీ కార్యకర్తలు

    Date:

    Anganwadi Workers
    Anganwadi Workers

    Anganwadi Workers : ఏపీలో అంగన్ వాడీ కార్యకర్తల సమ్మె 21వ రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ జీతాలు పెంచేలా బటన్ నొక్కాలని.. లేదంటే మరో మూడు నెలల్లో తాము నొక్కే బటన్ తో రాష్ట్రంలో వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. మచిలీపట్నంలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కొత్త ఏడాది సందర్భంగా కార్మికులు తమ సమ్మెను కొనసాగిస్తూ శిబిరంలోనే కేకు కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు.

    కొత్త సంవత్సరంలో ఇంటి పట్టున ఉండాల్సిన తమను సీఎం జగన్ ఇలా నడిరోడ్డు మీద కూర్చుబెట్టారని, తాము ఇంతలా అవస్థలు పడుతుంటే ఆయనకు తమపై కనికరం కలగడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే.. సీఎం జగన్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది  మీరు కాదా? మీ మాటలను నమ్మి ఓటు వేస్తే.. ఇలా అన్యాయం చేస్తారా? అంటూ మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు.

    విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు అంటూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే తాము కూడా వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం చూసుకుంటామని హెచ్చరించారు. తమకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడం అబద్ధమన్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు రెంట్లు, ఫోన్లు తమ కోసం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఫోన్లతో తమకు పనిభారం మరింత పెరిగిందని వాపోయారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వేతనాలు పెంచారని, గ్రాట్యూటీ కూడా చాలా రాష్ట్రాల్లో అమలవుతోందని, తమపై ప్రభుత్వ వైఖరితో తాము తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామన్నారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...