36.9 C
India
Monday, May 20, 2024
More

    Galla Jayadev: టీడీపీకి గల్లా జయదేవ్ గుడ్ బై?

    Date:

    2024 సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తోంది.అధికారంలోకి రావడానికి ఇప్పటికే జనసేనతో కలిసి పోటీ చేయాలని పావులు కదుపుతోంది.  అయితే ఇటువంటి కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ ఒక రు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం లోక్సభ స్థానాలను కైవసం చేసు కుంది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయు డు గెలుపొందారు. ముగ్గురు కూడా హేమాహేమీలే. అయితే ఇందులో ఇప్పటికే కేశినేని నానీ పార్టీని వీడి వైసిపిలో చేరారు. తాజాగా సీనియర్ ఎంపీ గల్లా జయదేవ్ కూడా  పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుండడం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

    టిడిపి తో జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బిజెపి సైతం ఆ రెండు పార్టీలతో కలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మూడు పార్టీలకు ఎంపి స్థానాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా జనసేనకు రెండు ఎంపీ స్థానాలు కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. కానీ బిజెపి విషయం స్పష్టత వచ్చాకే దీనిపై ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ బిజెపి కానీ చేరితే.. ఎమ్మెల్యేల కంటే ఎంపీ స్థానాలని కేటాయించాల్సి ఉంటుంది. దీనికి టిడిపి సైతం మానసికంగా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

    ఇటువంటి పరిస్థితుల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీని వీడుతారని సమాచారం. అయితే ఆయనకు వేరే పార్టీలో చేరాలని ఉద్దేశం లేకపోయినా.. పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయిం చుకున్న ట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. కనీసం నియోజకవర్గం లో సైతం కనిపించడం లేదు. ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడడం లేదని జయదేవ్ తన సన్నిహితు ల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    AP Inter Results : ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

    AP Inter Results : ఫస్ట్ ఇయర్ లో 67.. సెకండ్ ఇయర్...