30.9 C
India
Saturday, May 4, 2024
More

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Date:

    Pandikona Wild Dog
    Pandikona Wild Dog

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో జరుగుతున్న మార్పుల వల్ల ఈ కుక్కలు సింహాల మాదిరిగానే అడవి జంతువులను కూడా చీల్చి చెండాడేంత శక్తిని పుంజుకుంటున్నాయి. అయితే, అడవి కుక్కలు కూడా ఉన్నాయి. కానీ ఇవి అవికావు. శునక రూపం.. చిరుత రాజసం ఉన్న ‘పంది కోన’ కుక్కల గురించి తెలుసుకుందాం.

    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లా ‘పంది కోన’ గ్రామానికి చెందినీ ఈ శునకాల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. చూసేందుకు సాదాసీదాగా కనిపిస్తాయి. కానీ వీసమెత్తు అనుమానం వచ్చినా దాడి చేసి వాటి ప్రతాపం చూపిస్తాయి. పందికోన గ్రామ సింహాలు ఎందుకింత ప్రత్యేకంగా ఉన్నాయి? మనం కూడా తెచ్చుకోవచ్చా? ధర ఎంత? అసలెక్కడ దొరకుతాయ్‌? వంటి సందేహాలు ఉన్నాయా? ఆ విషయాలు మీకోసం.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పందికోన ప్రాంతానికి చెందిన శునకాల ఖ్యాతి ఖండాంతరాల్లో మార్మోగుతోంది. పోలీస్‌ సేవలు, మూగజీవాలకు రక్షణ, పంట పొలాలకు కాపలాగా ఉండే ఈ కుక్కలు క్రూర మృగాలను సైతం ఎదురించగలవు. వేటాడే తత్వం, పౌరుషం, గాంభీర్యం .. లక్షణాల కారణంగా ఎన్నారైల నుంచి పోలీస్ అధికారులు, ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ గ్రామానికి క్యూ కడుతున్నారు.

    మగ చిరుత.. – ఆడ శునకాల క్రాస్‌ బ్రీడ్‌
    కర్నూలు జిల్లా పత్తికొండకు 9 కి.మీ. దూరంలో ఉన్న పందికోన గ్రామాన్ని బ్రిటిష్‌ కాలంలో పాలెగాళ్లు ఏలేవారు. అప్పట్లో అడవుల్లోని చిరుతల గ్రామంలోకి వస్తుండేవి. అలా గ్రామ సత్రంలో ఓ చిరుత ప్రసవించింది. అలా ప్రసవించిన చిరుత కూన గ్రామంలోనే ఉండేది. శునకాలతో ఎక్కువగా తిరిగేది. వయస్సుకువచ్చిన తర్వాత గ్రామంలోని ఆడ కుక్కలతో కలిసి  జత కట్టేదట. దీంతో క్రాస్ బ్రీడ్ కింద ఈ కుక్క పిల్లలు పుట్టాయని, అలా వాటి సంతానం పెరుగుతూ వచ్చినట్లు గ్రామవాసులు చెప్తున్నారు. పందికోనలో 700 కుటుంబాలు ఉన్నాయి. వీరంతా 1500కు పైగా శునకాలను పోషిస్తున్నారు. ఈ కక్కులకు చిన్న వయసులోనే దేహంపై రెండు వైపులా వాతలు పెడతారు. ఈ శునకాలు యజమానులు తినే ఆహారాన్నే తింటాయి. పప్పుతో కలిపిన అన్నం, జొన్న రొట్టెలు, మటన్‌, చికెన్ ఇష్టంగా లాగించేస్తాయి.

    అదే పందికోన శునకాల విశిష్ట
    పందికోన కుక్కలను పశువులు, మేకలు, గొర్రెల మందల రక్షణగా గ్రామస్తులు వినియోగిస్తున్నారు. ఎంతటి క్రూర మృగాలనైనా ఇవి ఎదురించి తరిమికొట్ట గలవు. దొంగలను ముట్టడించి దాడి చేయడం ప్రత్యేకత. పంటలను నాశనం చేసే అడవి పందులను వేటాడి తింటాయి. దీంతో పందికోన శునకాల ప్రత్యేకత దేశవిదేశాలకు పాకింది. హైదరాబాద్, అమరావతి, ఢిల్లీతోపాటు అమెరికా, ఇతర దేశాలకూ వీటి ఎగుమతి ప్రారంభమైంది.

    వీటి విశిష్టత గుర్తించిన అమెరికా టీం 37 యేళ్ల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించి కుక్కల కోసం షెల్టర్, వసతి సౌకర్యాల కోసం నిధులు ఇస్తామని చెప్పగా.. గ్రామస్తులు నిరాకరించారు. స్వదేశంలో కేంద్ర రక్షణ శాఖ, పోలీస్ శాఖ పౌర రక్షణ సేవలకు వినియోగిస్తున్నారు. గృహ యజమానులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా శునకాలను కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఢిల్లీ నుంచి డిస్కవరీ ఛానల్‌ ప్రతినిధులు గ్రామానికొచ్చి శునకాలను అధ్యయనం చేసి వెళ్తుంటారని గ్రామస్తులు చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Inter Results : ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

    AP Inter Results : ఫస్ట్ ఇయర్ లో 67.. సెకండ్ ఇయర్...

    Mudragada : పిరికితనంతోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు..

    Mudragada : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ...

    Bhashyam Praveen : ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న..పెదకూరపాడు టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్..

    Bhashyam Praveen :  పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలోని...

    Jagan-Modi : జగన్ మోడీకి లొంగిపోయి పన్ను భారాన్ని ప్రజలపై వేశారు..? 

    Jagan-Modi : బిజెపి, వైసిపి పాలనలో ఇంటి పన్ను భారం ప్రజలపై...