29.5 C
India
Sunday, May 19, 2024
More

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు..

    Date:

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కెనడాలో సంక్రాంతి సంబురాలు వైభవంగా నిర్వహించారు. హాలిఫాక్స్, బెడ్ ఫోర్డ్, డార్ట్ మౌత్ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయులు బెడ్‌ఫోర్డ్‌లోని ఫ్రెంచ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు సుప్రజ హరి, శ్రీలేఖ, ప్రియాంక సురేష్ తదితరులు వేడుకల ప్రాంగణాన్ని తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే సంక్రాంతికి పండుగకు అద్దం పట్టేలా అలంకరించారు.

    నోవా స్కోటియాకు చెందిన 300కు పైగా తెలుగు కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నారు. కనకం, పార్వతి, దేవిక, ప్రతిభ, సుప్రజా హరి జ్యోతి ప్రజ్వలన చేసి గణేశ వందనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. అధ్యక్షుడు శ్రీహరి రెడ్డి చల్లా ముఖ్య అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో చిన్నారులకు భోగి పండ్లు పోశారు. సీబీ నాథన్ కర్ర సాము చేసి వీక్షకులను ఆకట్టుకున్నాడు. ‘సొగసు చూడ తరమా’ పేరుతో దంపతుల మధ్య జరిగిన పోటీలు ఆద్యాంతం హాస్యం పంచాయి. పార్వతి శాస్త్రి చల్లూరి, నూకరాజు కరణం, వేణుగోపాల్ రావు బెజవాడ కళాకారులను జ్ఞాపికతో సత్కరించారు.

    నిత్య శ్రీవిద్య, రోహిత్ సాయి చల్లా, మహాశ్విన్ విద్యా, శ్రీనివాస్ చిన్ని, సుష్మ ప్రదీప్, మిహిర మొగలిపురి, దాన్షిక సురేష్, సాయి రేయాన్ష్ చిన్ని, శ్రేష్ఠ శ్రీమయి దొంతంశెట్టి, సంగీత రాజు, కీర్తన రాజీవ్, అమూల్య పిన్ని, మెగ్గీ కరమ్, హర్షవర్ధన్ ఆలేటి, శిబి నందన్ మహేష్ కుమార్, మోక్షిత చిన్ని, జోషిత్ మొగలిపురి, పూజ బరన్వాల్, రితి నైనికా కోతా, ఆరాధ్య మల్కా, రిధి బొజ్జిని వారి వారి ప్రదర్శనలతో సభికులను అలరించారు. వెంకట్, సత్యం, సర్ధార్ ఖాన్ ఫొటోగ్రఫీ అందించారు. విజయ్ రాహుల్ భాష్యకర్ల, ఆండ్రూ లీపర్, జితేందర్ బాలి, శివ నవనీథన్ వేడుక విజయవంతానికి తోడ్పడ్డారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Canada : కెనడా వెళ్లనంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?

    Canada : ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత...

    Canada : విదేశీ విద్యార్థులకు కెనడా షాక్.. 2024 నుంచి ఏం చేస్తుందంటే?

    Canada : విదేశీ వ్యవహారాల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం...