30.1 C
India
Thursday, May 16, 2024
More

    Bonda Umam : రాష్ట్రాన్ని దోచేసిన అసలైన పెత్తందారు జగన్ రెడ్డి…బొండా ఉమామహేశ్వరరావు ?

    Date:

     

    2019లో వైసీపీ అధ్యక్షుడి హోదాలో జగన్ రెడ్డి ప్రజల్ని అబద్ధాలు, కల్లబొల్లి మాటలతో మోసగించాడ ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ అసత్యప్రచారం చేస్తోంద ని, తనను కాంగ్రెస్ అన్యాయంగా జైలుకు పంపిందని కట్టుకథలు చెప్పి ప్రజల్ని మోసగిం చాడన్నారు.  నేడు తన చెల్లి షర్మిల,జగన్ రెడ్డి తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడటానికి, బెయిల్ కోసం తన భర్త బ్రదర్ అనిల్ కుమార్, ఆయన భార్య భారతి రెడ్డిని సోనియాగాంధీ వద్దకు పంపిన రహస్యాన్ని బయటపెట్టడంపై జగన్ రెడ్డి దంపతులు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

    జగన్ రెడ్డి ఎలాంటివాడో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. జగన్ అవినీతి.. తనపై ఉన్న కే సుల నుంచి బయటపడటానికి అతను ఢిల్లీ పెద్దలతో జరిపిన వ్యవహారాలు,తెరవెనుక జరిపిన మంత్రాం గాలు సహా అనేక విషయాలు బయటపెడితే, టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది అన్నారు. జగన్ రెడ్డి, వైసీపీ నేతలు మా పార్టీ అభిప్రాయాల్ని, వాదనను అడ్డగోలుగా బుకాయించారన్నారు.జగన్ లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకోవాలి. షర్మిల చెప్పేది నిజమో…లేక జగన్ రెడ్డి ప్రజలకు చెప్పింది నిజమో తెలియాలంటే లైడిటెక్టర్ పరీక్షే కరెక్ట్ అన్నారు.

    ఇవాళ సొంత చెల్లే జగన్ రెడ్డి గుట్టు బయటపెట్టింది. అధికారంలోకి రాకముందు జగన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలని, ప్రజల్ని మోసగించడానికి కట్టుకథలు అల్లా డని నేడు ఆయన చెల్లి షర్మిల వ్యాఖ్యలతో తేలిపోయింది. షర్మిల చెప్పేది నిజమో… లేక జగన్ రెడ్డి చెప్పింది నిజమో తెలియాలంటే తక్షణమే జగన్ కు లైడిటెక్టర్ పరీక్షలు చేయించాలి. జగన్ రెడ్డే స్వయంగా లైడిటెక్టర్ పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడే జగన్ నోటినుంచి అసలైన నిజాలు బయటకు వస్తాయి. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన జగన్ రెడ్డికి న్యాయస్థానాల్లో బెయిల్ రాకపోవడంతో, తన బావ బ్రదర్ అనిల్ కుమార్, భార్య భారతిని సోనియా గాంధీ వద్దకు పంపి, జగన్ బెయిల్ పొందాడన్నది వాస్తవం. ఇదే నిజాన్ని షర్మిల బయటపెట్టింది. జగన్ రెడ్డి చెల్లి తాజాగా బయటపెట్టిన నిజాలు.. ఎప్పటినుంచో టీడీపీ చెబుతున్న వాస్తవాలు ఒక్కటేనని ఇప్పుడు తేలిపోయింది. తనపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు?

    తన ఆడపడుచు షర్మిల వ్యాఖ్యలపై భారతిరెడ్డి తక్షణమే నోరువిప్పాలి

    తనపై కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా కేసులు పెట్టిందని, అప్పటి కేంద్రప్రభుత్వం (కాంగ్రెస్ ప్రభుత్వం) నాపై కక్షతో వ్యవహరించిందని, నాపై పెట్టిన కేసుల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని జగన్ రెడ్డి బొంకాడు. ఇప్పటికీ వైసీపీ నేతలు అదే వల్లె వేస్తుంటారు. మరిప్పుడు సొంతచెల్లి షర్మిల చెబుతున్న నిజాలపై జగన్ రెడ్డి, వైసీపీ బ్యాచ్ ఏం సమాధానం చెబుతారు? తన ఆడపడుచు షర్మిల బయటపెట్టి న నిజాలపై జగన్ భార్య భారతి ఎందుకు నోరువిప్పడం లేదు? జగన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య భారతి రెడ్డి, షర్మిల భర్త అనిల్ కుమార్ ను వెంట బెట్టుకొని సోనియాగాంధీ వద్దకు ఎందుకు వెళ్లింది? ఏం మాట్లాడటానికి వెళ్లిందో భారతిరెడ్డి చెప్పాలి. షర్మిల వ్యాఖ్యలపై భారతిరెడ్డి తక్షణమే నోరువిప్పాలి. బ్రదర్ అనిల్ కుమార్ ను వెంటబెట్టుకొని వెళ్లి మరీ సోనియాగాంధీతో తాను మాట్లాడిన వివరాల్ని భారతిరెడ్డి వెంటనే బహిర్గతం చేయాలి.

    లాబీయింగ్ లు..లాలూచీల్లో జగన్ రెడ్డిని కొట్టేవాడే లేడు.

    లాబీయింగ్ లు… లాలూచీల్లో జగన్ రెడ్డిని కొట్టినవాడే లేడు. రూ.2కోట్ల విలువైన చేతిగడియారంతో ఏకంగా న్యాయమూర్తినే దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు … ఇప్పటికీ చేస్తున్నాడు. తాను జైలుకెళ్లకుండా ఉండటంకోసం పార్టీ ఎంపీలతో కేంద్రప్రభుత్వంతో…ఢిల్లీపెద్దలతో లాబీయింగ్ జరుపుతుంటాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. విజయసాయిరెడ్డి లాంటి గొప్పగొప్ప లాబీయిస్ట్ లను జగన్ రెడ్డి తన పనులు చక్కబెట్టుకోవడానికి, తన అవినీతిని కప్పిపుచ్చడానికి వినియోగి స్తున్నాడు. తనపై ఉన్న కేసులకు భయపడి కేంద్రంతో రాజీపడిన జగన్ రెడ్డి… చివరకు రాష్ట్రప్రయోజనాలు కూడా పణంగా పెట్టాడు. ఆఖరికి సొంత బాబాయ్ హత్యకేసులో దోషుల్ని కాపాడటానికి ఏకంగా సీబీఐ అధికారులపై, తనచేతిలోని పోలీస్ వ్యవస్థతో తప్పుడు కేసులు పెట్టించి బెదిరింపులకు పాల్పడ్డాడు. బాబాయ్ కూతురు సునీత, ఆమెభర్తపై తప్పుడు కేసులు పెట్టించి వారిని భయ భ్రాంతులకు గురిచేశాడు.

    2004లో తనకు రూ.40లక్షల అప్పులున్నాయని చెప్పిన జగన్ రెడ్డి.. నేడు రూ.4 లక్షల కోట్ల సంపాదనపరుడు ఎలా అయ్యాడు?

    2004లో తొలిసారి ఎంపీగా పోటీచేసేటప్పుడు జగన్ రెడ్డి తనకున్న ఆస్తి రూ.7 నుంచి రూ.8కోట్లని ఎన్నికల అఫిడవిట్లో చెప్పాడు. రూ.40లక్షల అప్పు ఉందని, ఇంటిని తాకట్టుపెట్టానని కూడా అఫిడవిట్లో చెప్పాడు. అదే జగన్ రెడ్డికి నేడు రూ.4 లక్షల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి? తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారం లో ఉన్న 6 ఏళ్లలో జగన్ రెడ్డి అంతులేని అవినీతికి పాల్పడ్డాడు. సీబీఐ..ఈడీలు జగన్ ను విచారించి రూ.43 వేలకోట్ల అక్రమాస్తులు కలిగిఉన్నాడని తేల్చాయి. దర్యాప్తు సంస్థల లెక్కల ప్రకారం రూ.43 వేలకోట్లు…వాస్తవానికి ఆ మొత్తం విలువ రూ.లక్షకోట్లకు పైనే. 2019లో తాను అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని, ప్రకృతి వనరుల్ని దోచేసి లక్షలకోట్లు మింగేశాడు. మొత్తంగా రూ.4 లక్షలకోట్ల ప్రజల సొమ్ము బొక్కేశాడు.

    జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పేదలు బతకడానికే నానా అవస్థలు పడ్డారు. పేద కుటుంబాలు రూపాయి సంపాదించడానికే అష్టకష్టాలు పడ్డారు. అలాంటిది జగన్ రెడ్డి మాత్రం ఏకంగా లక్షలకోట్లు సంపాదించాడు. ఏ వ్యాపారం చేసి ఇంత సొమ్ము సంపాదించాడో జగన్ రెడ్డి చెప్పాలి. లక్షలకోట్లున్న జగన్ రెడ్డి పేదవాడా? ప్రజల సొమ్ము బొక్కేసి, రాష్ట్రాన్ని లూఠీ చేసిన పెత్తందారు జగన్ రెడ్డి. సాక్షి పత్రిక తనది కాదు.. టీవీ తనది కాదు..తాను పేదవాడిని..అనే కాకమ్మకబుర్లతో ఎన్నాళ్లు ప్రజల్ని మోసగిస్తావు జగన్ రెడ్డి? జగన్ రెడ్డి పాపాలు పండాయి కాబట్టే నేడు అతని చీకటి వ్యవహారాల్ని సొంత చెల్లి షర్మిల బయటపెట్టింది. ఆమెతో పాటు.. త్వరలోనే జగన్ తల్లి కూడా ఆయన బాగోతం ప్రజల ముందు పెడుతుంది.” అని బొండా ఉమా తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...