31 C
India
Monday, May 20, 2024
More

    Bollywood Producer : తారక్ తో సినిమా చేయాలని బాలీవుడ్ అగ్ర నిర్మాత తంటాలు

    Date:

    Bollywood Producer
    Bollywood Producer and NTR

    Bollywood Producer : బహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడమే కాదు తెలుగు సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ప్రభాస్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఇదే ప్రయత్నం బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహర్  కూడా చేశారు. డైరెక్ట్ హిందీ సినిమా ద్వారా ప్రభాస్ తో ఓ సినిమా చేద్దామనుకున్నా ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల వీలు కాలేదు. ఇక కనీసం తెలుగు, హిందీ భాషల్లోనైనా చేద్దామనుకున్నారు. దానికి వీలు పడలేదు. దీంతో డార్లింగ్ పై కరణ్ కాస్త అలిగాడని అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి.  కానీ అలాంటిదేం లేదని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో అంతా సద్దుమణిగింది.

    ఇక కరణ్ కన్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద పడ్డట్టు సమాచారం. వార్ -2 తో బాలీవుడ్ లో తారక్ లాంచ్ అవుతున్నాడు. అయితే ఆయన రోల్ ఏంటి? కథ ఏంటి అనే విషయాలు బయటకు లీక్ చేయడం లేదు. ఇది సెట్స్ పై ఉండగానే కరణ్ ..తారక్ తో ఓ సినిమా లాక్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. తారక్ తాజా చిత్రం ‘దేవర’ను పాన్ ఇండియన్ లెవల్ లో నార్త్ బెర్త్ లో కరణ్ జోహర్ నిర్మాణ సంస్త అనిత్ తందానీతో కలిసి రిలీజ్ చేస్తున్నారు.

    అయితే ఈ అవకాశంతో కరణ్  దేవర రిలీజ్ తర్వాత తారక్ తో ఓ సినిమా చేసే దిశగా చర్చలు జరుపుతున్నారని టాక్. ఈ సినిమా తెలుగు నిర్మాణంలో తారక్ సోదరుడు కల్యాణ్ రామ్ కూడా భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. కరణ్ ఈ ప్రాజెక్ట్ లో ఎంటర్ అవ్వడానికి కారణం కల్యాణ్ రామ్ అని భోగట్టా. కరణ్ తో డీల్ ఓకే కావడానికి కల్యాణ్ రామ్ కారణమట. కరణ్ జోహర్..కల్యాణ్ రామ్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ తారక్ అప్ డేట్స్ తెలుసుకుంటున్నారట. కరణ్ బ్యానర్లో తారక్ సినిమా చేస్తే బాగుంటుందనే డిస్కషన్స్ ఇద్దరి మధ్య నడిచాయట. మరి ఈ లీకుల్లో ఎంత వరకు నిజముందో…సినిమా పట్టాలకు ఎక్కితే గాని తెలియదు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    Super Star Rajinikanth : ఒక్క సినిమాకే రూ.280 కోట్లు..?

    ‘కూలీ’ సినిమాకు రజనీకాంత్ పారితోషికం Super Star Rajinikanth : భారతదేశంలో...

    Bollywood Movie Offers : ఆఫర్లు.. మరింత దిగజారుస్తున్నాయా?

    Bollywood Movie Offers : 2024 ప్రారంభం బాలీవుడ్ అంతగా కలిసి...

    Pushpa 2 : పుష్ప ను చూసి భయపడుతున్న బాలీవుడ్

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్...