37.8 C
India
Saturday, May 18, 2024
More

    Viral News : నామినేషన్ వేసేందుకు వచ్చిన ‘విడదల రజిని’ కిడ్నాప్..?

    Date:

    Viral News
    Viral News, Kidnap

    Viral News : ఏపీ ఎన్నికల్లో ఒక్కో చోట ఒక్కో ఘటన చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళను కిడ్నాప్ చేసిన ఘటన ఈ రోజు (ఏప్రిల్ 25-గురువారం) బయటకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్ గడువు ఉంది.

    గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ‘విడదల రజిని’ అనే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కర్యాలయానికి వచ్చింది. ఆమె నామినేషన్ పేపర్లపై విడదల రజిని అనే పేరును చూసి వైసీపీ నేత అప్రమత్తమయ్యాడు. వెంటనే పార్టీ శ్రేణులకు విషయం చెప్పాడు. విడదల రజిని పేరు ఉండడంతో చిలుకలూరి పేట ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో ఆమెకు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఏర్పడింది.

    దీంతో అప్రమత్తమైన వైసీపీ నాయకులు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్న మహిళను నుంచి బలవంతంగా నామినేషన్ వేయకుండా బయటకు తీసుకువచ్చారు. అయితే నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ వార్తలు వ్యాపించాయి. కానీ,  వైసీపీ నేతలు మాత్రం సదరు మహిళతో టీడీపీ నాయకులే నామినేషన్ వేయించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.

    కాగా మహిళ కిడ్నాప్ వార్తలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ ఎక్కడ ఉందో గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు ఎటువంటి ఆపద లేదని బాగానే ఉందని చెప్తున్నారు. కానీ ఆమె మళ్లీ తన నామినేషన్ ను వేస్తుందా? వేయదా? అనేది మాత్రం ఇంకా తెలియలేదు. విడదల రజినీ పేరు ప్రముఖంగా ప్రస్తావించడంతో ఏపీలో కంగారు నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    చిన్నారులే వాడి టార్గెట్.. అర్థరాత్రి కిడ్నాప్ చేసి..

    తాగిన మైకంలో ఆ మానవమృగం ఏం చేస్తుందో తెలియదు. అభం,  శుభం...