![Chahal-Dhanashree](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/auto-draft-2474.jpg)
Chahal-Dhanashree : టీం ఇండియా క్రికెటర్ హర్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ తన భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం ఆమె హర్దిక్ ఆస్తి నుంచి 70 శాతం భరణం కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే ముందుగానే ఇలాంటి పరిస్థితి వస్తుందని గ్రహించిన హర్దిక్ తన ఆస్తిలో సగం వాటాను తన తల్లి పేరున రాశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఓ షోలో హర్దిక్ పాండ్యానే వెల్లడించారు. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. అందుకే అమ్మ పేరు మీదనే 50 శాతం ఆస్తులు రాశానని చెప్పుకొచ్చాడు.
హర్దిక్ పాండ్యా కు సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ తో నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. వీరిద్దరి విడాకుల రూమర్స్ పై ఇప్పటి వరకు పాండ్యా స్పందించలేదు. కానీ నటాషా మాత్రం కొత్త ప్రయాణం మొదలు కాబోతుందని డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేసేందుకు వెళ్లినపుడు ఒక మ్యాప్ ను ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇది కచ్చితంగా వారు విడిపోయినందుకే చేశారని అందరూ అనుకుంటున్నారు.
టీం ఇండియా స్పిన్నర్ చాహాల్ భార్య ధనశ్రీ కూడా కొరియోగ్రాఫర్, యూట్యూబర్. ధనశ్రీ 2024 మే 27న ఇన్ స్టాలో ఒక పోస్టు చేసింది. ఫిట్ నెస్ గురించి వివరిస్తూ చేసిన పోస్టు పిక్స్ చాలా వైరల్ అయ్యాయి. ఆమెకు ఫిట్ నెస్ పై ఉన్న ఇంట్రస్ట్ ఎంటో అందరికీ తెలిసేలా చేసింది. ఇంతవరకు అందరూ మెచ్చుకున్నారు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం చాహల్ అమాయకుడు.. ఎప్పటికైనా చాహల్ ను ధనశ్రీ కూడా నటాషాలాగే ముంచుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటి నుంచే నీ ఆస్తిని కాపాడుకో అంటూ చాహాల్ కు ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరి కొంతమంది క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ నీ కొంపముంచే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ధనశ్రీ గతంలో శ్రేయస్ అయ్యర్ తో కలిసి ఇన్ స్టాలో ఒక ఢ్యాన్స్ రీల్ కూడా చేసింది. దీంతో నటాషా బాటలో పయనించేది ధనశ్రీ అని అందరూ చర్చించుకుంటున్నారు. చాహాల్ జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు.