27.1 C
India
Sunday, June 30, 2024
More

    Ashlin Jimmi : ‘హీరోయిన్ పాత్ర రాలేదు.. కాబట్టి ముంబైపై టెర్రర్ అటాక్స్ కు ఓకే’.. ఓ రచయిత సంచలన వ్యాఖ్యలు..

    Date:

    Ashlin Jimmi
    Ashlin Jimmi

    Ashlin Jimmi : ప్రపంచం మొత్తం ఉగ్రవాదం అనే భూతంతో అల్లాడిపోతుంది. ఈ విషయంలో సాధారణ ప్రజలను చైతన్య పర్చాల్సిన బాధ్యత రచయితలు, కవులు, సోషల్ మీడియా ఇన్ఫ్యూయెన్సర్లు పై ఉంది కానీ వారే ఉగ్రవాదంకు మద్దతుగా మాట్లాడితే ఇంకేముంది. సాధారణ ప్రజలు కూడా ఇదే కరెక్ట్ అనుకోవాలా? ఇటీవల అష్లిన్ జిమ్మి అనే రచయిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనను హీరోయిన్ చేయనందుకు గానూ భారత్ పై ఉగ్రవాదం ప్రేరేపితం కావాలని కోరుకుంది. పైగా గతంలో జరిగిన ఉగ్రదాడులను సమర్థించింది కూడా.

    భారత్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులను బహిరంగంగా సమర్థించింది ఆష్లిన్ జిమ్మీ. ఈమెపై భారతీయులతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి వైరల్ వీడియోలో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుండగా.. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోలో ఆష్లిన్ జిమ్మీ భారత్ లో ఉగ్రవాద దాడులు సరైనవే అని ఆమోదముద్ర వేయడంతో ఆన్ లైన్ లో దుమారం చెలరేగింది.

    ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘ముంబైకి వచ్చి కాల్పులు చేస్తున్న పాకిస్తానీయులకు నేను మద్దతిస్తున్నానని చెప్పాను. ఎందుకంటే ముంబై అలాంటి ప్రదేశం, నేను ముంబైని ద్వేషిస్తాను. ముంబై వాసులు నిజంగా ఒకరినొకరు ప్రేమించి ఉంటే నాకు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చేవారు. నన్ను షారుఖ్ ఖాన్ లేదంటే సల్మాన్ ఖాన్ హీరోయిన్ అని ఎందుకు పిలవలేదు? ముంబై ఇతరులను పట్టించుకోవడం లేదని ఇది రుజువు చేస్తుందని’ ఆమె అన్నారు.

    ఆమె వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరారు. జిమ్మీ వ్యాఖ్యలు ఆమె నేపథ్యం, ప్రేరణలపై చర్చకు దారితీశాయి. కేరళలోని తిరువనంతపురానికి చెందిన జిమ్మీ రచయితగా గుర్తింపు పొందింది. అంతేకాక, జిమ్మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ను తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

    Share post:

    More like this
    Related

    Varshikotsava Celebrations : శ్రీ సాయి దత్త పీఠంలో ‘వర్షికోట సేవా’ ఉత్సవాలు

    Varshikotsava Celebrations : భారతీయ సంస్కతి, ఆధ్యాత్మికను పెంపొందించేందుకు అమెరికాలో ఏర్పాటు...

    TTD Chairman : టీటీడీ చైర్మన్ పదవి వారికేనా..?

    TTD Chairman : ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మికత ప్రదేశం తిరుమల. కలియుగ...

    World Cup Celebrations : ప్రపంచ కప్ సంబురాలు.. ట్యాంక్ బండ్ పై అభిమానుల కేరింతలు

    World Cup Celebrations : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ లో...

    Virat Kohli : టీ20లకు విరాట్ బైబై

    Virat Kohli : టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related