28 C
India
Friday, May 17, 2024
More

    ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్న ఎస్ ఎస్ రాజమౌళి

    Date:

    ss rajamouli bags best director award new york film critics circle
    ss rajamouli bags best director award new york film critics circle

    ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ” ఆర్ ఆర్ ఆర్ ” చిత్రానికి గాను  ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నాడు. ఇంతకీ రాజమౌళి అందుకున్న అవార్డు ఏ సంస్థ ఇచ్చిందో తెలుసా …… ప్రతిష్టాత్మకమైన ” న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ” ( NYFCC ) జక్కన్న ను ఉత్తమ దర్శకుడిగా సత్కరించింది. ఈ కార్యక్రమం అమెరికాలో జరుగగా భారతీయ వస్త్రధారణలో హాజరయ్యాడు జక్కన్న.

    తన భార్య రామా రాజమౌళి తో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో ధోతి , కుర్తా లో హాజరయ్యాడు రాజమౌళి. అంతేకాదు ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నాడు. ఇంకేముంది ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. జక్కన్నకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. భారత కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగురవేయడంతో జక్కన్న కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాడు.

    గత ఏడాది వేసవిలో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచింది. కొద్ది దూరంలోనే ఉంది. నాటు నాటు అనే పాట ఒరిజినల్ కేటగిరిలో నామినేట్ అయిన విషయం తెలిసిందే. షార్ట్ లిస్ట్ లో నాటు నాటు సాంగ్ ఉండటంతో తప్పకుండా ఆస్కార్ రావడం ఖాయమని భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    RRR Joins TDP : టీడీపీ లోకి RRR విజయనగరం నుంచి బరిలోకి..?

    RRR Joins TDP : విజయనగరం రఘురామ ను బరిలోకి దింపే...

    #SSMB29 : మహేశ్ సరసన చెల్సియా ఇస్లాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదు..

    #SSMB29 : బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాజిక్ క్రియేట్ చేశాడు...