#SSMB29 : బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాజిక్ క్రియేట్ చేశాడు ఎస్ఎస్ రాజమౌళి.
2022లో ఆర్ఆర్ఆర్ తీసి బాహుబలి కంటే భారీ కలెక్షన్లు సాధించాడు. దీంతో పాటు ‘నాటు నాటు’ పాటతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆస్కార్ తెచ్చాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో భారీ అడ్వెంచర్ ను తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ కూడా అందించినట్లు ప్రకటించారు.
రీసెంట్ గా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి ‘చెల్సియా ఇస్లాన్’ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇండోనేషియా టీవీ, చలనచిత్రాల్లో, ముఖ్యంగా పాపులర్ షో ‘టెటాంగా మాసా గిటు’లో ఆమె అద్భుతంగా నటించింది. ఈ వార్త బయటకు రావడంతో ఇటు మహేశ్ ఫ్యాన్స్ లో తెగ ఉత్సాహం కనిపించింది. ఆమెపై రాజమౌళి ఇప్పటికే స్క్రీన్ టెస్ట్ కూడా చేసినట్లు టాలీవుడ్ గాసిప్.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెల్సియా ఇస్లాన్‌ని పరిచయం చేయాలనే ఆలోచన రాజమౌళికి అనుకుంటున్నారట. ఆమెను తీసుకువస్తే నేషనల్ దాటి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను కూడా అంటే హాలీవుడ్ లో ఫేమ్ కావచ్చని అనుకుంటున్నారట. ఆమె పేరుతో పాటు మరో పేరు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె పేరు కూడా వినిపిస్తుంది. ఈ సినిమాకు గ్లామర్ ఎంత ముఖ్యమో స్టార్ కూడా అంతే ముఖ్యమని జక్కన్న భావిస్తున్నారట.
సినిమా నిర్మాణం ఆఫ్రికాలోని అద్భుతమైన సెట్టింగ్‌లతో సహా అనేక ప్రదేశాల్లో జరగాలని భావిస్తున్నారు, ఇది రాజమౌళి చిత్ర నిర్మాణానికి విశిష్టమైన గొప్పతనాన్ని పెంచుతుంది. రాజమౌళి, మహేశ్ బాబు మధ్య సహకారం, దీపికా పదుకొణె, చెల్సియా ఇస్లాన్ తారాగణంతో పాటు అద్భుతమైన మరియు అసాధారణమైన సినిమాటిక్ అనుభవాన్ని సూచిస్తుంది.