AP Anganwadis : అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసులు కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2 ప్రభుత్వం విడుదల చేసింది .అంగన్వాడి వర్కర్లు ,హెల్పర్లకు వేతనంలో రాష్ట్ర ప్రభుత్వం కోత కోసింది. సమ్మె చేసిన కాలానికి 3000 వేతనం తగ్గించి మిగతా వేతనం రూ.8,050 రూపాయలు జమచేసింది. అంతేకాకుండా ఆరు నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
గత కొంతకాలంగా తమ డిమాండ్లను పరిష్కరిం చాలని ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడి కార్యకర్తలపై ప్రభుత్వం అన్నoత పని చేసింది. సమ్మె చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపుతూ ఎస్మా ప్రయోగించింది దీంతో అంగన్వా డీ కార్యక ర్తలు షాక్ కు గురయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై అంగన్వాడీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారు వేచి చూడాల్సి ఉంది.