34.4 C
India
Thursday, May 16, 2024
More

    AP Train Accident 2023 : ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

    Date:

    AP Train Accident 2023
    AP Train Accident 2023

    AP Train Accident 2023 : ఏపీలోని విజయగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పది మంది మృతి చెందగా, మరో 50 మంది వరకు గాయపడ్డారు. ఇందులో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రెండు రైళ్లు ఢీకొనడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి దీంతో ఆ ప్రాంతమంతా చీకట్లు అలుముకున్నాయి రాత్రంతా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఇక పలు రైళ్లను దారిమళ్లించారు

    ఈ ఘటనలో ప్యాసింజర్‌ రైలును పలాస ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. మూడు ప్యాసింజర్‌ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలానికి మంత్రి బొత్స సత్యనారాయణ, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికాపాటిల్, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీను జిల్లా యంత్రాంగం స్థానికులతో సహాయకచర్యలు చేపట్టారు. మంత్రి బొత్స మాట్లాడుతూ క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్ దవాఖానకు తరలించారు ఇక మృతుల్లో ఏపీకి చెందిన వారైతే రూ. 10 లక్షలు, ఇతర రాష్ట్రానికి చెందిన వారైతే రూ.2 లక్షలు, ఏపీ క్షతగాత్రులకు రూ. 2 లక్షలు, ఇతర రాష్ర్టాలకు చెందిన వారైతే రూ. 50వేలు ముఖ్యమంత్రి ప్రకటించినట్లు బొత్స తెలిపారు

    సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..
    విజయనగరం సమీపంలో రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు.. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని సీఎం ఆదేశించారు మంచి వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయాలని ఆదశించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటే ఘటనా స్థలానికి 14 అంబులెన్సులు చేరుకున్నాయి. రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్‌ చేశారు.

    ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి తెలియజేశారు. సహాయ బృందాలను వెంటనే ఘటనాస్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఘటనాస్థలానికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపించామని, స్థానిక కలెక్టర్‌, ఎస్పీకూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టిపెట్టారని, వీరిని సమీపంలో ఉన్న దవాఖానలకు పంపిస్తున్నారని, అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    Gujarat News : ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి

    Gujarat News : గుజరాత్ లోని నర్మదా నదిలో ఈత కొట్టేందుకు...

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related